Israel: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని.. హెజ్బొల్లాకు వార్నింగ్.. ఎందుకంటే?

ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాల్పుల విరమణను బుధవారం నుంచి అమల్లోకి రానుంది.

Israel Agrees To Hezbollah Ceasefire

Israel Agrees To Hezbollah Ceasefire: ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కాల్పుల విరమణను బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. తాజా పరిణామంతో గత 13నెలలుగా ఇజ్రాయెల్ – హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధానికి బ్రేక్ పడినట్లయింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. కాల్పులు విరమణ వ్యవధి అనేది లెబనాన్ లో ఏమి జరుగుతుందనే దానిపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. మేము ఒప్పందాన్ని అమలు చేస్తాం. హెజ్బొల్లా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తామని నెతన్యాహూ హెచ్చరించారు. బుధవారం ఉదయం నుంచి ఈ ఒప్పందం ప్రారంభం కానుండగా.. ఈ అంశంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఇది మంచి పరిణామం అన్నారు. ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని యూకే ప్రధాని స్వాగతించారు.

Also Read: Donald Trump: అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ మూడు దేశాలకు బిగ్ షాకివ్వనున్న డొనాల్డ్ ట్రంప్.. ఎందుకంటే?

ఇజ్రాయెల్ – లెబనాన్ కేద్రంగా దాడులకు పాల్పడుతోన్న హెజ్బొల్లా మధ్య కాల్పులను ఆపేందుకు యూఎస్, యూరప్ దేశాలు, ఐక్యరాజ్య సమితి చాలాకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి ముందుకు రాలేదు. అయితే, తాజాగా.. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఎట్టకేలకు ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడంతో యుద్ధం ముగింపు దశకు చేరుకున్నట్లయింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందం వివరాలను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యూయెల్ మాక్రాన్ సంయుక్తంగా బుధవారం ఈ అంశంపై మాట్లాడే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

Also Read: నట్టేట ముంచిన త్యాగం..! ఆ అణ్వాయుధాలే ఉంటే యుక్రెయిన్‌ మరోలా ఉండేదా? రష్యాకు చుక్కలు చూపించేదా?

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు లెబనాన్ లోని హెజ్బొల్లాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడం వెనుక మూడు కారణాలను వెల్లడించారు. లెబనాన్ లో ఏమి జరుగుతుందనే దానిపై కాల్పుల విరమణ వ్యవధి ఆధారపడి ఉంటుందని కూడా చెప్పాడు. కాల్పుల విరమణ ప్రాథమిక కారణాల్లో ఒకటి.. హమాస్ ఒంటరిగా చేయడం, హమాస్ చెరలో ఉన్న బందీలుగాను తిరిగి పొందడం. ‘మేము హెజ్బొల్లాను దశాబ్దాలుగా వెనక్కి నెట్టివేశాము. ఇది మూడు నెలల క్రితం కల్పితంలా కనిపించేది. కానీ, మేము చేశాము’ హెజ్బొల్లా అగ్రనాయకులను హతమార్చడానికి ఇజ్రాయెల్ చేపట్టిన కార్యకలాపాలను ప్రస్తావిస్తూ నెతన్యాహూ చెప్పారు.

ఇదిలాఉంటే.. గాజాలో యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ పై 2023 అక్టోబర్ 7న పాలస్తీనా గ్రూపు చేసిన దాడి తరువాత హమాస్ కు మద్దతుగా లెబనీస్ గ్రూప్ నిలిచింది. అక్టోబర్ 2023 నుంచి దేశంలో 3,799 మంది మరణించారని లెబనాన్ తెలిపింది. వారిలో ఎక్కువ మంది గత కొన్ని వారాల్లోనే మరణించారు. ఇజ్రాయెల్ వైపు కనీసం 82 మంది సైనికులు, 47 మంది పౌరులు మరణించినట్లు అధికారులు తెలిపారు.