Donald Trump: అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ మూడు దేశాలకు బిగ్ షాకివ్వనున్న డొనాల్డ్ ట్రంప్.. ఎందుకంటే?

2025 జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆ వెంటనే మూడు దేశాల నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై భారీగా సుంకాలను విధించే అవకాశం ఉంది.

Donald Trump: అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ మూడు దేశాలకు బిగ్ షాకివ్వనున్న డొనాల్డ్ ట్రంప్.. ఎందుకంటే?

Donald Trump

Updated On : November 26, 2024 / 9:14 AM IST

Donald Trump: అమెరికాలో ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరి 20న అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే, ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే మూడు దేశాలకు గడ్డు రోజులు ప్రారంభమైనట్లేనని తెలుస్తోంది. చైనా, మెక్సికో, కెనడాలపై అదనపు సుంకాలను విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. మెక్సికో, కెనడా నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులకు 25శాతం సుంకం విధించాలని భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అదేవిధంగా చైనా నుంచి దిగుమతులకు 10శాతం సుంకం వసూలు చేసే యోచనలో ట్రంప్ ఉన్నాడని తెలుస్తోంది. అయితే, ఈ విషయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ట్రూత్ సోషల్’ పేజీలో పేర్కొన్నారు. జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత తన తొలి సంతకం ఈ దస్త్రాలపైనే ఉంటుందని చెప్పారు.

Also Read: Donald Trump: కేసు కొట్టివేత.. డొనాల్డ్ ట్రంప్‌న‌కు భారీ ఊరట

మెక్సికో, కెనడా సరిహద్దుల నుంచి వేలాది మంది అమెరికాలోకి ప్రవేశిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికాలో నేరాల స్థాయి చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో కూడా మెక్సికో నుంచి అక్రమ వలసదారులు పెద్దెత్తున అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. మెక్సికో, కెనడా నుంచి యూఎస్ లోకి దిగుమతి అవుతున్న అన్ని ఉత్పత్తులపై నేను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే 25శాతం సుంకాన్ని విధిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు చైనా నుంచి అమెరికాకు పెద్ద సంఖ్యలో డ్రగ్స్ సరఫరా అవుతున్నాయని, ముఖ్యంగా ‘ఫెంటానిల్’ పై చైనా అడ్మినిస్ట్రేషన్ తో మాట్లాడానని, అయితే, ఫలితం లేదని ట్రంప్ అన్నారు. డ్రగ్స్ డీలర్లు పట్టుబడితే మరణశిక్ష విధిస్తామని చైనా ప్రతినిధులు నాకు చెప్పారు. అయితే దురదృష్టవశాత్తు చైనా దీనిని అనుసరించలేదు. చైనా నుంచి అమెరికాకు డ్రగ్స్ రవాణా కొనసాగుతూనే ఉంది. ఈ డ్రగ్స్ ప్రధానంగా మెక్సికో ద్వారా అమెరికాకు రవాణా అవుతున్నాయి. ఈ క్రమంలో చైనాపై అదనంగా 10శాతం సుంకం విధించబోతున్నామని ట్రంప్ అన్నారు.

Also Read: నట్టేట ముంచిన త్యాగం..! ఆ అణ్వాయుధాలే ఉంటే యుక్రెయిన్‌ మరోలా ఉండేదా? రష్యాకు చుక్కలు చూపించేదా?

అయితే, ట్రంప్ నిర్ణయం ఉత్తర అమెరికాలోని వ్యాపారంపై ప్రభావితం చూపే అవకాశం ఉంది. అంతకుముందు ట్రంప్ నూతన కేబినెట్ గురించి చైనా విధాన సలహాదారు జెంగ్ యోంగ్నియన్ మాట్లాడుతూ.. ఎలోన్ మస్క్, భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామితో కూడిన ట్రంప్ బృందం నుంచి చైనాకు అతిపెద్ద ముప్పు ఉంటుందని పేర్కొన్నాడు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికా పాలనలో జరిగే మార్పుల కారణంగా చైనాపై అతిపెద్ద ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉందని, దీని కారణంగా అమెరికా రాజకీయ వ్యవస్థతతో చైనా పోరాడాల్సి వస్తుందని జెంగ్ యోంగ్నియన్ పేర్కొన్నాడు.