సహారా అంతా ఎడారి కాదు.. 180 కోట్ల వృక్షాలతో పచ్చదనం

సహారా అంతా ఎడారి కాదు.. 180 కోట్ల వృక్షాలతో పచ్చదనం

Updated On : October 16, 2020 / 1:58 PM IST

Sahara ప్రాంతాన్ని ఒక్క ఎడారి ప్రాంతంగానే భావిస్తున్నాం. కానీ, అక్కడ వృక్షాల సంఖ్య గురించి మీకు తెలుసా. 180 కోట్ల వృక్షాలు ఆ ప్రాంతమంతా వ్యాపించి ఉన్నాయంట. శాటిలైట్, ఇమేజరీ టెక్నిక్, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అల్గారిథమ్ తో సైంటిస్టులు కీలక విషయాలు కనుగొన్నారు.

సాధారణంగా ఇంత విస్తారమైన ప్రాంతంలో చెట్ల సంఖ్య కనుక్కోవడం మామూలు విషయం కాదు. ఈ పద్ధతితో ఆ ప్రాంతంలోని చెట్ల సంఖ్యను కనుగొని వెస్టరన్ సహారా 1.8 బిలియన్ (180కోట్లు)కు పైగా ఉన్నాయని విశ్లేషణలో తేలింది.



చెట్లు భూమిని కాపాడుతున్నాయి:
చెట్లు, పొదల్లాంటి మొక్కలు ఆ ప్రాంతాలని పచ్చగా మార్చడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అవి కొన్ని జంతువులకు నివాసాలు, ఆహార వనరులుగానూ ఉంటున్నాయట. నేల కొట్టుకుపోవడం వంటి వాటి నుంచి పరిసరాలను కాపాడుతున్నాయి. ఇటువంటి రీమోట్ ఏరియాల్లో చెట్ల సంఖ్యను మానిటరింగ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు కదా మరి.

మార్టిన్ బ్రాండ్, అతని కొలీగ్స్ కలిసి హై రిసొల్యూషన్ సెన్సింగ్ డేటాతో శాటిలైట్ ఇమేజెస్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెనస్ పాటరన్ రికగ్నిషన్ అల్గారిథమ్ ఉపయోగించి సంఖ్యను లెక్కపెట్టారు. చరిత్రలో ఇప్పటివరకూ లేని టెక్నిక్ ను ఉపయోగించి లెక్కబెట్టారు.

పాత లెక్కలు పక్కకుపెట్టాం:
గతంలోని అభిప్రాయాలను అంచనాలుగా పరిగణించి ఒక్కో చెట్టును లెక్కపెట్టగలిగాం. స్టడీ ప్రకారం.. వెస్టరన్ Sahara , సాహెల్, సుదానియన్ జోన్ లలో చాలావరకూ చెట్లు ఉన్నాయి. స్టడీలో 3చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉన్న చెట్లనే పరిగణనలోకి తీసుకున్నారు. అవి దాదాపు 1.3మిలియన్ చదరపు కిలోమీటర్ల వరకూ విస్తరించి ఉన్నాయి.

వెనువెంటనే కన్‌క్లూజన్ కు రావడం అనేది చాలా కష్టం. పైగా అది వెస్టరన్ ఆఫ్రికాలో.. ఈ మెథడ్ వాడి మాత్రం కరెక్ట్ నెంబర్ కనుక్కోగలిగాం. ఆ ప్రాంతంలో ఉన్న మొక్కలను హైలెట్స్ చేయడంతో అవి ఉన్న సంఖ్యను తెలుసుకోగలిగాం. అని మార్టిన్ బ్రాండ్ వివరించారు.

వాతవరణం మెరుగ్గా ఏం లేదు:
ఈ వాతావరణం మేం ఊహించిన దాని కంటే బెటర్ గా ఉందని చెప్పలేం. ఎందుకంటే లోకల్ స్టడీస్ ప్రకారం.. ఇక్కడ చెట్లు ఉన్నాయి. అదేం సీక్రెట్ కాదు. ఇప్పుడు మా దగ్గర టూల్ ఉంది. అది మ్యాప్ లో వృక్షాలు ఎక్కడుంటే అక్కడ మార్క్ చేసి కనిపిస్తుంది. దీంతో పరిసరాలను, పొడి వాతావరణంలోని కార్బన్ సైకిల్ ను గుర్తించవచ్చు.

ప్రయత్నం గొప్పది:
ఈ టెక్నిక్ ఎక్కడైనా వాడొచ్చని శాటిలైట్ డేటా 0.5మీటర్ల రిసొల్యూషన్ తో కనిపిస్తుంది. ప్రతి అబ్జెక్టివ్ డేటాను స్పష్టంగా చూపించే ప్రయత్నం చేస్తుంది. డీప్ లెర్నింగ్ లో భాగంగా మేం చెట్లు ఎలా కనిపిస్తాయనేది అల్గారిథంలో ముందుగానే సేవ్ చేసి ఉంచాం. ఇలా ట్రైనింగ్ లో చేయడంతో శాటిలైట్ చెట్లు కనిపించినప్పుడు క్రౌన్స్(కిరీటాలు)కనిపించేవి. అప్పుడు మేం కచ్చితంగా చెట్లు, ఇళ్లు, కార్లు, ఆవులు ఏమున్నా సరే తెలుసుకోగలం. ఇదంతా చాలా ఖరీదైన శాటిలైట్ ఇమేజింగ్ టెక్నిక్ తోనే సాధ్యపడింది’ అని మార్టిన్ బ్రాండ్ట్ అన్నారు.

ఇతర ప్రదేశాల్లో ఇదే ప్రయోగం చేయాలంటే ముందుగా చేయాల్సింది శాటిలైట్ డైటా చీప్ గా దొరికేలా చేసుకోవాలి. సరిపడ అల్గారిథమ్స్ రాసుకుని.. గ్రౌండ్ వర్క్ పై మరికొంచెం ఫోకస్ పెట్టాలి’ అని ఎకో సిస్టమ్ ఎకాలజిస్ట్ నియాల్ హనన్ అన్నారు. ఈ టెక్నిక్ తో చెట్ల సాంద్రత, ఆ ప్రదేశంలో ఎన్ని చెట్లు ఉన్నాయనే దానిని తెలియజేయడానికి సాధ్యపడుతుందని హనన్ వివరించారు.