Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Japan Earthquake : జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. హెచ్చరికలు తొలగించే వరకు జనాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Japan declare tsunami warning coast after massive 7 4 magnitude earthquake hits
- జపాన్ ని కుదిపేసిన భూకంపం
- 7.4 తీవ్రతతో కంపించిన భూమి
- సునామీ హెచ్చరిలు జారీ
Japan Earthquake : భారీ భూకంపంతో జపాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సోమవారం ఉత్తర జపాన్‌లో 7.4 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇవాటే ప్రిఫెక్చర్, హక్కైడోలోని కొన్ని ప్రాంతాల్లో సుమారు 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తీర ప్రాంత నివాసితులు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. భూకంపం వల్ల సంభవించబోయే నష్టాన్ని, మారుతున్న పరిస్థితిని పర్యవేక్షిస్తుండటంతో పాటు అత్యవసర సేవలు అందిస్తున్నారు.
అంచనా వేసిన సమయం కన్నా ముందుగా లేదా ఆలస్యంగా అలలు రావచ్చని.. అవి ఊహించిన దానికంటే ఎత్తుగా ఉండవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న తీర ప్రాంతవాసులు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని.. హెచ్చరికలు తొలగించే వరకు సురక్షితంగా ఉండాలని సూచించారు.
పసిఫిక్ “రింగ్ ఆఫ్ ఫైర్” పశ్చిమ అంచున ఉన్న నాలుగు ప్రధాన టెక్టోనిక్ ప్లేట్లపై ఉన్న జపాన్, ప్రపంచంలోనే అత్యధిక భూకంప ప్రభావిత దేశాలలో ఒకటి. సుమారు 125 మిలియన్ల జనాభా కలిగిన ఈ ద్వీపసమూహం, సాధారణంగా ప్రతి ఏటా సుమారు 1,500 భూప్రకంపనలను చవిచూస్తుంది. ప్రపంచంలోని భూకంపాలలో సుమారు 18 శాతం ఇక్కడే సంభవిస్తాయి.
వాటిలో అత్యధికం తేలికపాటివే.. అయినప్పటికీ అవి కలిగించే నష్టం అవి సంభవించే ప్రదేశాన్ని బట్టి.. భూమి ఉపరితలం కింద అవి తాకే లోతును బట్టి మారుతూ ఉంటుంది. 2011లో, 9.0 తీవ్రత గల భూకంపం సునామీని ప్రేరేపించింది. దానివల్ల 18,500 మంది మరణించారు.. గల్లంతయ్యారు.. ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకరమైన మెల్ట్‌డౌన్ సంభవించింది.
