ట్రంప్ కి చెమటలు పట్టిస్తున్న జో బైడెన్

  • Published By: venkaiahnaidu ,Published On : November 4, 2020 / 09:55 AM IST
ట్రంప్ కి చెమటలు పట్టిస్తున్న జో బైడెన్

Updated On : November 4, 2020 / 11:36 AM IST

Biden Ahead In In Usa Poll Counting 2020లో అమెరికా అధ్యక్ష పదవిని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కైవసం చేసుకుబోతున్నట్లు సృష్టంగా అర్థమవుతోంది.

విజయం దిశగా జో బైడెన్ దూసుకుపోతున్నారు. కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా,న్యూయార్క్ లతో పాటు న్యూజెర్సీ,వాషింగ్టన్,ఓరెగావ్,మేరీల్యాండ్,కొలరాడో,డెలావేర్,కనెక్టికట్,మసాచుసెట్స్,వేర్నాట్,ఇల్లినాయిస్ రాష్ట్రాల్లో జో బైడెన్ విజయం సాధించారు.



ఇప్పటివరకు ట్రంప్ 16 రాష్ట్రాలలో ట్రంప్ విజయం సాధించగా..13 రాష్ట్రాల్లో జో బైడెన్ విజయం సాధించారు. అత్యధిక రాష్ట్రాల్లో విజయం సాధించినప్పటికీ ఎలక్ట్రోరల్ కాలేజ్ ఓట్లలో ట్రంప్ బాగా వెనుకబడిపోయారు. జో బైడెన్ కు ఇప్పటివరకు 209 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రాగా, డొనాల్డ్ ట్రంప్ కు 112 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు లెక్కించిన పాపులర్ ఓట్స్ లో ట్రంప్ ముందంజలో ఉన్నారు.