Trump కు కరోనా..Joe Biden ట్వీట్

  • Publish Date - October 3, 2020 / 06:21 AM IST

TRUMP : అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కొద్ది రోజుల్లో (నవంబర్ 03వ తేదీ) జరుగబోతున్నాయి. మరోసారి అధ్యక్ష పీఠంపై కూర్చోవాలని ట్రంప్ ఉవ్విళ్లూరుతున్నారు. ట్రంప్ కు చెక్ పెట్టేందుకు జో బైడెన్ (Joe Biden) ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్‌ను డెమోక్రాట్లు అధికారికంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.



ఈ క్రమంలో…ట్రంప్ (Trump) దంపతులు (భార్య మెలానియా) కరోనా బారిన పడడం ఆందోళన రేకేత్తించింది. ఆయన త్వరగా కోలుకోవాలంటూ..పలువురు ట్వీట్ చేస్తున్నారు. జో బైడెన్ కూడా ట్వీట్ చేశారు. ట్రంప్,



ప్రథమ మహిళ మెలానియా త్వరగా కోలుకోవాలని తన అర్థాంగి జిల్, తాను మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నామంటూ..బైడెన్ ట్వీట్ చేశారు. దేశాధ్యక్షుడు, ఆయన కుటుంబం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని తాము ప్రార్థిస్తూనే ఉంటామని తెలిపారు.



అయితే..అంతకుముందు జో బైడెన్ (Joe Biden) చేసిన ట్వీట్ లో ట్రంప్ పై విమర్శల వర్షం కురిపించారు. అమెరికాలో కరోనా అరికట్టడంలో ట్రంప్ విఫలమయ్యారని, వాస్తవం నుంచి దృష్టి మరల్చేందుకు ట్రంప్ ఏదైనా చేస్తారన్నారు. వైరస్ కారణంగా దేశంలో రెండు లక్షల మంది చనిపోయారని, 26 మిలియన్ల మంది నిరుద్యోగులయ్యారు, ప్రతి 6 చిన్నతరహా వ్యాపారాల్లో ఒకటి శాశ్వతంగా మూతపడే పరిస్థితి వచ్చిందని బైడెన్ విమర్శించారు.