Kabul Bomb Blast : కాబూల్‌లో స్కూళ్లే లక్ష్యంగా బాంబు పేలుళ్లు.. భారీ సంఖ్యలో విద్యార్థులు మృతి?

Kabul Bomb Blast : పశ్చిమ కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లు అలజడి సృష్టించాయి. హైస్కూళ్లే లక్ష్యంగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి.

Kabul Bomb Blast : కాబూల్‌లో స్కూళ్లే లక్ష్యంగా బాంబు పేలుళ్లు.. భారీ సంఖ్యలో విద్యార్థులు మృతి?

Kabul Bomb Blast Three Explosions Targeting Schools Rock Kabul, 25 Students Killed

Kabul Bomb Blast : పశ్చిమ కాబూల్‌లో వరుస బాంబు పేలుళ్లు అలజడి సృష్టించాయి. హైస్కూళ్లే లక్ష్యంగా మూడు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. మంగళవారం (ఏప్రిల్ 19) స్కూళ్ల వద్ద జరిగిన పేలుళ్ల ఘటనలో కనీసం 25 మంది విద్యార్థులు దుర్మరణం చెందినట్టు సమాచారం. ఈ మేరకు అప్ఘాన్ భద్రతా ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. డజన్ల కొద్దీ గాయపడ్డారని తెలిపారు. పశ్చిమ కాబూల్‌లోని ముంతాజ్ పాఠశాల వద్ద తొలి పేలుడు సంభవించింది. ఈ పేలుడులో పలువురు గాయపడినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు.

రాజధానిలోని దష్త్-ఎ-బర్చి జిల్లాలోని పాఠశాల సమీపంలో రెండో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మరో ఆరుగురు మరణించారని, డజన్ల కొద్దీ జనం గాయపడ్డారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పేలుళ్లలో కనీసం నలుగురు మరణించారని, 14 మంది గాయపడ్డారని ఆసుపత్రి నర్సింగ్ విభాగం అధిపతి ఒకరు తెలిపారు.

పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో షియా హజారా కమ్యూనిటీకి చెందిన చాలా మంది నివాసితులు ఉన్నారు. ఇస్లామిక్ స్టేట్‌తో సహా సున్నీ మిలిటెంట్ గ్రూపులు తరచుగా వీరిపై దాడులకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం జరిగిన ఈ మూడు బాంబు పేలుళ్లలో భారీగా ప్రాణనష్టం జరిగిందని కాబూల్ కమాండర్ ప్రతినిధి ఖలీద్ జద్రాన్ అన్నారు. అయితే ఇప్పటివరకూ ఈ వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించలేదు.

Read Also : Uttar Pradesh Crime: 28ఏళ్ల తర్వాత రేప్ నిందితుడ్ని పట్టించిన డీఎన్ఏ టెస్ట్