Uttar Pradesh Crime: 28ఏళ్ల తర్వాత రేప్ నిందితుడ్ని పట్టించిన డీఎన్ఏ టెస్ట్

పొరుగింటిలో ఉండే మైనర్ బాలికపై అన్నదమ్ములు చేసిన గ్యాంగ్ రేప్ 28ఏళ్లకు బయటపడింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో జరిగిన ఘటనను బాధితురాలి కొడుకు 28ఏళ్ల తర్వాత వెలుగులోకి..

Uttar Pradesh Crime: 28ఏళ్ల తర్వాత రేప్ నిందితుడ్ని పట్టించిన డీఎన్ఏ టెస్ట్

Uttar Pradesh

Uttar Pradesh Crime: పొరుగింటిలో ఉండే మైనర్ బాలికపై అన్నదమ్ములు చేసిన గ్యాంగ్ రేప్ 28ఏళ్లకు బయటపడింది. ఉత్తరప్రదేశ్ లోని షాజహాన్పూర్ లో జరిగిన ఘటనను బాధితురాలి కొడుకు 28ఏళ్ల తర్వాత వెలుగులోకి తీసుకొచ్చాడు.
1994 నుంచి 1996 మధ్య కాలంలో 12ఏళ్ల వయస్సున్న బాలికపై పొరుగింటి అన్నదమ్ములు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఫలితంగా ఆమె గర్భం దాల్చి మగ శిశువుకు జన్మనిచ్చింది. బిడ్డను వేరే వాళ్లకు ఇచ్చేయాలని బలవంతపెట్టడంతో ఉత్తరప్రదేశ్ లోనే ఓ జంట దత్తత తీసుకుంది. కంప్లైంట్ చేస్తే ప్రాణ హాని చేస్తామని బెదిరింపులు కూడా ఎదుర్కొంది.

అలా 28ఏళ్లు గడిచిపోయాక.. 2020వ సంవత్సరంలో బాధితురాలు తన కొడుకుని కలిసి న్యాయం కోసం పోరాడేందుకు సహాయం చేయాలని కోరింది. కన్నతల్లి కోరినట్లుగానే నిందితులైన ఇద్దరు అన్నదమ్ములపై కంప్లైంట్ చేశారు. ఘటన జరిగిన ఇన్నేళ్ల తర్వాత డీఎన్ఏ టెస్టు నిర్వహించిన పోలీసులు.. నిందితులే ఆమె కొడుకు పుట్టడానికి కారణమని తెలిసింది.

Read Also: బాలికపై 29మంది గ్యాంగ్ రేప్

‘ఈ పోరాటం ఆపేది లేదు. నా కన్న తల్లి పడిన బాధకు తగ్గ న్యాయం జరిగే వరకూ పోరాడుతూనే ఉంటాం’ అని బాధితురాలి కొడుకు మీడియా సమావేశంలో వెల్లడించాడు.