Mexican Restaurant : 13.5 సెకన్లలో ఫుడ్ సర్వ్ చేస్తున్న రెస్టారెంట్..
నేటికీ ఈ రెస్టారెంట్ ఇక్కడకు వచ్చే కస్టమర్లకు ఒక్క నిమిషంలోనే సేవలు అందిస్తోంది. ముందుగానే రెస్టారెంట్ లో అన్నీ సిద్ధం చేస్తారు. సంప్రదాయ మెక్సికన్ వంటలు తయారు చేయడానికి...

Karne Garibaldi
Karne Garibaldi Restaurant : ఏదైనా హోటల్ కు వెళితే..ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత కొన్ని నిమిషాల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఫుడ్ తేవడంలో ఆలస్యం చేస్తుండడంతో ఒక్కోసారి అసహానికి గురి కావాల్సి కూడా ఉంటుంది. కానీ..ఓ రెస్టారెంట్ మాత్రం కేవలం 13.5 స సెకన్ల వ్యవధిలో ఫుడ్ అందిస్తుండడం విశేషం. మెక్సికోలో Garibaldi restaurant గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది. ఇప్పటికి కూడా అదే విధంగా కొనసాగిస్తూ..కస్టమర్లను ఆకట్టుకొంటోంది. దీంతో ఆ రెస్టారెంట్ కు కస్టమర్లు క్యూ కడుతున్నారు.
Read More : Hemoglobin : శరీరంలో హిమోగ్లోబిన్ మోతాదు ఎంత ఉండాలంటే?
కస్టమర్లు రెస్టారెంట్ కు వచ్చినప్పుడు ఎవరు వేగంగా ఫుడ్ సర్వ్ చేయాలనే దానిపై అక్కడున్న వెయిటర్ ల మధ్య పోటీ ప్రారంభమైంది. సరదగా ఉన్న ఈ పోటీ ఏకంగా గిన్నీస్ వరల్ రికార్డు సంపాదించింది. 1996, ఆగస్టు 31వ తేదీన 13.5 సెకన్లలో అందించారు. నేటికీ ఈ రెస్టారెంట్ ఇక్కడకు వచ్చే కస్టమర్లకు ఒక్క నిమిషంలోనే సేవలు అందిస్తోంది. ముందుగానే రెస్టారెంట్ లో అన్నీ సిద్ధం చేస్తారు. సంప్రదాయ మెక్సికన్ వంటలు తయారు చేయడానికి గంటల తరబడి సమయం పడుతుంటుంది.
Read More : Dasari : ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్ వచ్చేస్తోంది..
రెస్టారెంట్ తెరవడానికంటే ముందుగా వంటకాలు తయారు చేస్తారు. అవి కూడా ప్లేట్ లో ఉంచుతారు. ఈ ఆహారం కస్టమర్ల టేబుల్ పైకి తేవడం కొన్ని సెకన్లలో జరిగిపోతుంటుంది. పనులు త్వరగా జరిగేందుకు వెయిటర్స్ లు సంకేతాలతో కమ్యూనికేట్ చేయడం కోసం రెస్టారెంట్ వారికి శిక్షణనిస్తుంటుంది. గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన తర్వాత..ఈ రెస్టారెంట్ కు పర్యాటకులు ఎక్కువ రావడం ప్రారంభించారు.