Kim Jong Un : దారుణం.. వీడియోలు చూశారని ఏడుగురికి ఉరిశిక్ష విధించిన ‘కిమ్ జోంగ్ ఉన్’

దక్షిణ కొరియా వీడియోలు చూశారనే కారణంతో ఏడుగురికి మరణశిక్ష విధించారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.

Kim Jong Un

Kim Jong Un : ఉత్తర కొరియా ప్రజలు నియంత కిమ్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారు. అతడు తీసుకునే నిర్ణయాలు, విధించే శిక్షలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తునట్లు గతంలో మానవ హక్కుల సంఘాలు ప్రపంచానికి తెలిపాయి. ఇక తాజాగా కిమ్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తర కొరియాకు శత్రుదేశమైన దక్షణ కొరియా వీడియో చూసినందుకు గత మూడేళ్ళలో ఏడుగురికి అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఉరిశిక్ష విధించాడని ట్రాన్సిష‌న‌ల్ జ‌స్టిస్ వ‌ర్కింగ్ గ్రూప్ అనే మాన‌వ హ‌క్కుల సంస్థ తన నివేదిక‌లో తెలిపింది.

చదవండి : Kim Jong Un : ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి దారుణ శిక్ష విధించిన కిమ్ జోంగ్

ఆ ఏడుగురు కేవ‌లం ద‌క్షిణ కొరియా సినిమాలు, మ్యూజిక్ వీడియాల‌ను చూసి వాటిని సీడీలు, యుఎస్‌బీలలో కాపీ చేసి అక్ర‌మంగా విక్ర‌యించినందుకు వారిని ఉరి తీసి చంపారు. శ‌త్రుదేశ‌మైన‌ ద‌క్షిణ కొరియా ప‌ట్ల త‌మ దేశ వాసులేవ‌రికీ సానుభూతి ఉండ‌కూడ‌దంటూ ఉత్త‌ర కొరియా అధ్య‌క్షుడు కిమ్ జో గ‌తంలో ప‌లుమార్లు త‌న ప్ర‌సంగాల‌లో చెప్పారు.

చదవండి : Kim Jong Un : నో బాడీ డబుల్..20 కిలోల బరువు తగ్గిన కిమ్

ఇక తాజాగా తన తండ్రి 10వ వర్ధంతి సందర్బంగా 11 రోజులపాటు దేశ ప్రజలు, నవ్వడం, మద్యం తాగడం, షాపింగ్ చేయడం, పుట్టినరోజు జరుపుకోవడం వంటివి నిషేదించిన విషయం తెలిసిందే. ఇటువంటి కఠిన నిబంధనల మధ్య ప్రజలు అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారని మానవహక్కుల సంఘం తెలిపింది.