భారతీయ సంప్రదాయం, దుస్తుల్లో ఆసీస్ క్రికెటర్ ఎంగేజ్ మెంట్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. భారత సంతతికి చెందిన వినీ రామన్(ఫార్మసిస్ట్)ను చాలాకాలంగా మ్యాక్స్

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. భారత సంతతికి చెందిన వినీ రామన్(ఫార్మసిస్ట్)ను చాలాకాలంగా మ్యాక్స్
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, కింగ్స్ ఎలెవన్ జట్టు ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగింది. భారత సంతతికి చెందిన వినీ రామన్(ఫార్మసిస్ట్)ను చాలాకాలంగా మ్యాక్స్ వెల్ ప్రేమిస్తున్న సంగతి తెలిసిందే. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరిద్దరి ఎంగేజ్ మెంట్ భారతీయ సంప్రదాయ పద్ధతిలో జరగడం విశేషం. భారతీయ సంప్రదాయ దుస్తుల్లో ఇద్దరూ మెరిశారు. ఆదివారం(మార్చి 15,2020) మెల్ బోర్న్ లో నిశితార్థ వేడుక జరిగింది. మ్యాక్స్ వెల్, వినీ రామన్ ఎంగేజ్ మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. షేర్వాణిలో మ్యాక్స్ వెల్ మెరిశాడు. నిశ్చితార్థ వేడుకకు విచ్చేసిన బంధు మిత్రులకు వినీరామన్ థ్యాంక్స్ చెప్పింది. దేశం కాని దేశంలో భారతీయ సంప్రదాయ పాటించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది.
వినీ రామన్ మెల్ బోర్న్‌కు చెందిన భారత సంతతి అమ్మాయి. ఆమె ఫార్మాసిస్ట్. చాలా కాలంగా మ్యాక్స్ వెల్, వినీ ప్రేమలో ఉన్నారు. వినీతో దిగిన ఫొటోలను ఇటీవలే మ్యాక్స్ వెల్ అభిమానులతో పంచుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్ అవార్డ్స్-2019 కార్యక్రమానికి మ్యాక్సీ తన ప్రేయసితో కలిసి రాగా తొలిసారి వీరి విషయం ప్రపంచానికి తెలిసింది. వినీ రామన్ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్థిరపడ్డ భారతీయ కుటుంబానికి చెందిన అమ్మాయి. తమిళనాడుకు చెందిన ఆమె కుటుంబం ఆస్ట్రేలియాలో స్థిరపడింది.
భారత అమ్మాయిని పెళ్లాడనున్న రెండో ఆసీస్ క్రికెటర్‌గా మ్యాక్సీ నిలవనున్నాడు. ఇంతకు ముందు షాన్ టైట్ భారత యువతినే పెళ్లి చేసుకున్నాడు. 2014 ఐపీఎల్ సమయంలో మాషుమ్ సింఘాను కలిసిన టైట్ తర్వాతి కాలంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మ్యాక్సీని రూ.10.75 కోట్లకు దక్కించుకుంది.
Also Read | స్వీపర్ పోస్టులో జాయిన్ అయిన MSc మ్యాథమెటిక్స్ పోస్ట్‌గ్రాడ్యుయేట్…