అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నాయి.. నవంబర్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ముందుగానే క్యాంపెయిన్ మొదలైంది.. అమెరికా, టెక్సాస్‌లోని Lake Travis సరస్సులో ట్రంప్ కు మద్దతుగా క్యాంపెయిన్ ఫ్లాగ్‌లతో మద్దతుదారులు పరేడ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా అనేక పడవలు మునిగిపోయాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని ఆస్టిన్ సమీపంలో Lake Travis వద్ద పెద్ద సంఖ్యలో ఓడలు దగ్గరగా వచ్చి కదలడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో పడవల్లోకి నీళ్లు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.
నీళ్లలో మునిగిపోతున్న వారంతా భయంతో రక్షించాలంటూ గట్టిగా కేకలేశారు. అప్రమత్తమైన అధికార సిబ్బంది వారిని నీట్లో నుంచి రక్షించారు.. ఈ ఘటనలో ఎంతమందికి గాయపడ్డారో సరైన నివేదికలు లేవు. లేక్ ట్రావిస్‌లో ట్రంప్ బోట్ పరేడ్ అని పిలిచే ఈ కార్యక్రమాన్ని ఫేస్‌బుక్‌లో నిర్వహించారు. 2,600 మందికి పైగా మద్దతుదారులు ఇందులో పాల్గొన్నారు.
బోటులు మునిగిన ఘటనపై దర్యాప్తు ప్రారంభిచామని అధికారులు తెలిపారు. ప్రమాదవశాత్తూ జరిగిందా? లేదా ఉద్దేశపూర్వకంగా చేశారా? అనేది ఎలాంటి ఆధారాలు లేవని ట్రావిస్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి క్రిస్టెన్ డార్క్ చెప్పారు. ఈ సంఘటన యుఎస్‌లో కార్మిక దినోత్సవ వారాంతంలో శనివారం మధ్యాహ్నం జరిగింది. పడవలను 10mph (16km/h)వేగంతో నడపాలని ఈవెంట్లో తెలిపింది.