భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు.. 50మంది మృతి

ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసిన పోస్టులో గోఫా మండలంలో కొండచరియలు విరిగిపడి ..

భారీ వర్షాలకు విరిగిపడిన కొండచరియలు.. 50మంది మృతి

Ethiopia

Ethiopia Landslides Triggered : దక్షిణ ఇథియోపియాలో విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. సోమవారం రెండు చోట్ల కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు, స్థానిక పోలీసులు కూడా ఉన్నట్లు ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఈబీసీ) నివేదించినట్లు దక్షిణ ఇథియోపియా ప్రాంతంలోని గోఫా జిల్లా జనరల్ అడ్మినిస్ట్రేటర్ మెస్కిన్ మిట్కు తెలిపారు. కొండచరియల కింద చిక్కుకున్న అనేకమందిని స్థానికులు కాపాడారు. వారికి తీవ్ర గాయాలు కావటంతో స్థానిక ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు పేర్కొంటున్నారు.

Also Read : ప్రభుత్వ ఆఫీసుల్లో వరుస అగ్నిప్రమాదాలు, కాలిపోతున్న కాగితాలు.. ప్రమాదమా? కుట్రకోణమా?

ఇథియోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ ఫేస్ బుక్ ఖాతాలో షేర్ చేసిన పోస్టులో గోఫా మండలంలో కొండచరియలు విరిగిపడి 20 మందికిపైగా మృతిచెందినట్లు పేర్కొంది. స్థానికులు, అధికారులు కొండచరియల కింద చిక్కుకుపోయిన వారికోసం వెతుకుతున్న ఫొటోలను షేర్ చేసింది. ఇదిలాఉంటే.. దక్షిణ ఇథియోపియాలో కొండచరియలు విరిగిపడటం సర్వసాధారణం. ముఖ్యంగా వర్షాకాలంలో జూన్ నుంచి ఆగస్టు వరకు ఇలాంటి ఘటనలు ఎక్కువ చోటుచేసుకుంటాయి. ఈ ప్రాంతంలో గతంలో విషాదకరమైన ఘటను చోటుచేసుకున్నాయి. 2018లో వారం వ్యవధిలో కొండచరియలు విరిగిపడటంతో 32 మంది మరణించారు. 2017లో ఇథియోపియా రాజధాని ఆడిస్ అబాబా శివార్లలో భారీ కొండచరియలు విరిగిపడటంతో 63 మందికిపైగా మరణించారు.

Also Read : కొడాలి నాని పీఏపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి.. తీవ్రగాయాలు