మాలీలో ఊచకోత: 134కి పెరిగిన  మృతులు

  • Publish Date - March 25, 2019 / 04:25 AM IST

బమాకో : మాలీలో నరమేథం ఘటనలో మృతుల సంఖ్య 134కు పెరిగినట్టు ఐక్యరాజ్య సమితి అధికారికంగా తెలిపింది. డోగన్ తెగకు చెందినవారు శనివారం (మార్చి23) సాయంత్రం సెంట్రల్ మాలీలోని ఒగొస్సొగౌ గ్రామంలో నరమేథానికి పాల్పడి..తబితల్ పులాకు తెగకు చెందిన ప్రజలను ఊచకోత కోసిన విషయం తెలిసిందే. ఈ మారణకాండకు సంబంధించిన వీడియో ఆదివారం  వెలుగులోకి వచ్చింది. బాధితుల మృతదేహాలను నేలపై చెల్లాచెదురుగా పడవేసి వారి నివాసాలను కాల్చి బూడిద చేసిన చేస్తున్న దృశ్యాలు ఆ వీడియో ఉన్నాయి.
Read Also : ఈసీ ముందుకు లక్ష్మీ’స్ ఎన్టీఆర్ నిర్మాత.. ఏం జరుగుతుంది?

బాధితుల్లో పలువురు వృద్ధులతో పాటు గర్భిణులు.. చిన్నారులు కూడా  ఉన్నట్టు పులాకు గ్రూపు వెల్లడించింది. ఈ ఘోరకలిలో చాలా మందిని వారి నివాసాలలోనే సజీవదహనం చేస్తున్న దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మాలీలో పర్యటిస్తున్న ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ డెలాట్రే ఈ నరమేథాన్ని తీవ్రంగా ఖండించారు.