Taliban warns US : ఈ నెల 31లోగా అఫ్ఘాన్ ఖాళీ చేయండి.. అమెరికాకు తాలిబన్ల వార్నింగ్!
అప్ఘానిస్తాన్ నుంచి ఖాళీ చేయాలంటూ అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Leave Afghanistan By August 31 Or Face 'serious Consequences (1)
Leave Afghanistan by August 31 or face ‘serious consequences : అప్ఘానిస్తాన్ నుంచి ఖాళీ చేయాలంటూ అమెరికాకు తాలిబన్లు వార్నింగ్ ఇచ్చారు. అగస్టు 31లోగా సైనిక బలగాలను ఉపసంహరించుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైనిక బలగాల ఉపసంహరణ నిర్దేశించిన గడువు నాటికి పూర్తి చేయాలని తాలిబన్లు డిమాండ్ చేశారు. అయితే ఈ ఉపసంహరణ గడువును మరింత పెంచే యోచనలో ఉన్నట్టు బైడెన్ వ్యాఖ్యానించడంతో తాలిబన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ఉద్రిక్తత పరిస్థితుల్లో సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని బైడెన్ చెప్పారు. తాలిబన్లతో ఒప్పందం ప్రకారం.. అమెరికా తన సైనిక బలగాలను పూర్తిగా వెనక్కి పంపిన తర్వాత మాత్రమే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అమెరికా సైన్యం ఉపసంహరణ పూర్తి కానంత వరకు తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉండదు.
All-Party Meeting : అప్ఘాన్ పరిస్థితులపై అఖిలపక్ష సమావేశానికి ప్రభుత్వం పిలుపు
అందుకే ఒప్పంద గడువు దగ్గర పడటంతో తాలిబన్లు అమెరికాకు హెచ్చరిక చేశారు. బలగాల ఉపసంహరణ పూర్తి చేయడానికి రెండు వారాల ముందే తాలిబన్లు అప్ఘాన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11 నాటికి అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలను వెనక్కి రప్పిస్తామని బైడెన్ గత ఏప్రిల్ నెలలో ప్రకటించారు. వేలాది మంది అఫ్ఘాన్ జాతీయులు, విదేశీయులు కొత్త తాలిబాన్ పాలన నుంచి తప్పించుకునేందుకు దేశం విడిచి పారిపోతున్నారు. అమెరికా, అనేక యూరోపియన్ దేశాలతో సహా వివిధ దేశాలలో ఆశ్రయం కోసం వెళ్లిపోతున్నారు. ఫలితంగా కాబూల్ విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.
తాలిబన్లకు అప్ఘాన్ సేన తలొగ్గింది. ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తాలిబన్లకు అప్ఘానిస్తాన్ రాజ్యాన్ని కట్టబట్టింది. ఇంతకీ తాలిబన్ల విజయానికి కారణం ఏంటి? అనే ప్రశ్నకు ఒకే సమాధానం వినిపిస్తోంది.. అదే అవినీతి.. ఇదే మాట ఎక్కువగా వినిపిస్తోంది. అందుకే తాలిబన్ల విజయం సునాయసమైందనే వాదన వినిపిస్తోంది.
20ఏళ్ల పాటు పాశ్చాత్య బలగాల శిక్షణ, అమెరికా, నాటో సేనలు అందించిన ఆయుధాలు, 3.5 లక్షలకుపైబడిన బలగం ఉన్నప్పటికీ తాలిబన్లపై ప్రతిఘటించేందుకు అఫ్గాన్ సేన ముందుకు రాలేదు. బలగాలు ఖాళీ చేసిన నెల రోజుల్లో దేశాన్ని తాలిబన్లు ఆక్రమించుకుంటారనే అమెరికా భావించింది. కానీ, అగ్రరాజ్యం అంచనాలను తలకిందులు చేస్తూ 10 రోజుల్లోనే అప్ఘాన్ సైన్యం తాలిబన్లకు లొంగిపోయింది.
Arshi Khan : తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘాన్.. క్రికెటర్‌తో నిశ్చితార్థం రద్దు చేసుకున్న నటి.