Libya Floods : లిబియా వరదల్లో పెరుగుతున్న మృతుల సంఖ్య, డ్యామ్ కొట్టుకుపోవడంపై దర్యాప్తు
లిబియా వరదల్లో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. డెర్నా నగరంలో వరదల కారణంగా 11,300 మంది మరణించగా మరో 10వేల మంది గల్లంతు అయ్యారు....

Libya Floods
Libya Floods : Libya floods : లిబియా వరదల్లో మృతుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. డెర్నా నగరంలో వరదల కారణంగా 11,300 మంది మరణించగా మరో 10వేల మంది గల్లంతు అయ్యారు. వరద విపత్తుకు ధ్వంసమైన డెర్నా నగరంలో 11,300 మంది మరణించగా, మరో 10,100 మంది తప్పిపోయారని మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం రెడ్ క్రెసెంట్ గణాంకాలు వెల్లడించాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. (Libya Floods Death Count Rises)
Mexico : మెక్సికో బార్‌లో కాల్పులు…ఆరుగురి మృతి
డెర్నా వెలుపల తూర్పు లిబియాలో వరదల వల్ల అదనంగా మరో 170 మంది మరణించారు. సహాయక సిబ్బంది సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టింది. డేనియల్ తుఫాను ఈశాన్య లిబియాను తాకిన వారం రోజుల తర్వాత డెర్నా నగరాన్ని వరదలు ముంచెత్తాయి. మంచినీటి ఎద్దడి సమస్యతో కలుషిత నీరు తాగి 55 మంది చిన్నారులు అనారోగ్యానికి గురయ్యారు. డెర్నా నగరంలో డ్యామ్ కొట్టుకుపోయిన ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తున్నారు.