LinkedIn: మహిళా ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు ముందుకొచ్చిన లింక్‌డ్ ఇన్

లింక్డ్‌ఇన్ కాలిఫోర్నియాలోని దాదాపు 700 మంది మహిళా కార్మికులకు $1.8 మిలియన్లు చెల్లించడానికి అంగీకరించింది. మహిళల పట్ల వివక్ష చూపిస్తూ పురుషల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్నారని కార్మిక శాఖ ఆరోపణలు..

LinkedIn: మహిళా ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు ముందుకొచ్చిన లింక్‌డ్ ఇన్

Linkedin

Updated On : May 5, 2022 / 6:44 AM IST

 

 

LinkedIn: లింక్డ్‌ఇన్ కాలిఫోర్నియాలోని దాదాపు 700 మంది మహిళా కార్మికులకు $1.8 మిలియన్లు చెల్లించడానికి అంగీకరించింది. మహిళల పట్ల వివక్ష చూపిస్తూ పురుషల కంటే తక్కువ వేతనం తీసుకుంటున్నారని కార్మిక శాఖ ఆరోపణలు గుప్పించడమే ఇందుకు కారణం.

కార్మిక శాఖ తెలిపిన వివరాల ప్రకారం, ఆన్‌లైన్-నెట్‌వర్కింగ్ కంపెనీలైన శాన్‌ఫ్రాన్సిస్కోలోని ఇంజనీరింగ్, మార్కెటింగ్ ఉద్యోగాలు, ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఉద్యోగాలలో పనిచేస్తున్న మహిళలు వారి సహోద్యోగులైన పురుషుల కంటే ఎక్కువ వేతనం పొందలేదు .

లింగ ఆధారిత వివక్ష చూపించడాన్ని అడ్డుకోవడంలో లింక్డ్ఇన్ ఫెయిల్ అయింది. కార్మికులపై వివక్ష చూపకుండా కంపెనీలను నిషేధించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను పాటించడంలో విఫలమైందంటూ కార్మిక శాఖ ఆరోపించింది.

Read Also: మహిళా ఉద్యోగులు ఒత్తిడిని ఇలా జయించండీ..

“ఈ విషయాన్ని పరిష్కరించడానికి అంగీకరించినప్పటికీ, ప్రభుత్వ వాదనలతో ఏకీభవించేందుకు సిద్ధంగా లేము. ఉద్యోగుల పట్ల లింక్డ్ఇన్ సమానంగా, న్యాయపరంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఉద్యోగులకు చెల్లిస్తూ వస్తున్నాం” అని టెక్ కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది .

కంపెనీతో కార్మిక శాఖకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం, లింక్డ్‌ఇన్ 686 మంది కార్మికులకు సుమారు $1.75 మిలియన్లు తిరిగి వేతనాలు, $50,000 కంటే ఎక్కువ వడ్డీని చెల్లిస్తుంది. దాని పరిహారం లింగ-ఆధారంగా లేదని గుర్తిస్తే, అంతర్గత సమీక్షను నిర్వహించాల్సి వస్తుంది..

లింక్డ్‌ఇన్ 2021 సమాన వేతన విశ్లేషణ ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా మహిళా సిబ్బంది.. పురుష సిబ్బంది సంపాదించిన ప్రతి $1.00కి $0.999 సంపాదించారని “మా ఉద్యోగులకు న్యాయపరమైన పరిహారం అందజేసేందుకు” దాని వేతన పద్ధతులను క్రమం తప్పకుండా మూల్యాంకనం చేస్తామని హామీ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా తమ నాయకత్వంలో దాదాపు 42% మహిళలు ఉన్నారని కంపెనీ పేర్కొంది .

బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ ప్రకారం 2021లో USలో పూర్తి సమయం మహిళా కార్మికులు సగటున పురుష కార్మికుల కంటే 16.9% తక్కువ సంపాదించారు . 2000లో, ఆ సంఖ్య 23.1%.