ఎంత క్యూట్‌గా ఉందో.. మూడేళ్ల చిన్నారి పాడిన పాటకు నెటిజన్లు ఫిదా.. రికార్డు స్థాయిలో వ్యూస్.. వీడియో వైరల్

క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో పాటపడిన మూడేళ్ల చిన్నారి పేరు ఏంజెలికా నీరో. చిన్నారి పాటపాడిన వీడియోను పియానో కళాకారుడు ఎమిల్ రీనెర్ట్

ఎంత క్యూట్‌గా ఉందో.. మూడేళ్ల చిన్నారి పాడిన పాటకు నెటిజన్లు ఫిదా.. రికార్డు స్థాయిలో వ్యూస్.. వీడియో వైరల్

Angelica Nero

Viral Video : మూడేళ్ల చిన్నారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఆ చిన్నారి పాడిన పాటకు సంబంధించిన వీడియోను చూసి నెటిజన్లను ఫిదా అవుతున్నారు. సూపర్ హిట్ హాలీవుడ్ మువీ ‘టైటానిక్’ సినిమాలోని ‘మై హార్ట్ విల్ గో ఆన్’ అనే సాంగ్ ను పియానో ఆర్టిస్ట్ తో కలిసి చిన్నారి పాడింది. ఈ వీడియోను కొద్ది రోజుల్లోనే 19కోట్ల మందికిపైగా నెటిజన్లు వీక్షించారు. గత కొన్నిరోజులుగా ఏ రీల్స్ కు కూడా ఈ స్థాయిలో వ్యూస్ దక్కలేదు. వీడియో చూసిన నెటిజన్లు చిన్నారిపై ప్రశంసల జల్లు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. నేను 1997లో టైటానిక్ సినిమా చూసినప్పటి కంటే ఇప్పుడు గట్టిగా ఏడుస్తున్నాను.. చిన్నారి పాడిన పాట హార్ట్ టచింగ్ గా ఉందంటూ పేర్కొన్నారు.

Also Read : Hema : చార్జ్ షీట్‌లో నా పేరు వచ్చినట్టు తెలిసింది.. మీడియా వ‌ల్ల‌నే నాపేరు : న‌టి హేమ‌

క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో పాటపడిన మూడేళ్ల చిన్నారి పేరు ఏంజెలికా నీరో. చిన్నారి పాటపాడిన వీడియోను పియానో కళాకారుడు ఎమిల్ రీనెర్ట్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశాడు. ఎమిల్ తన కామెంట్ ను కూడా జత చేశాడు. ఈ చిన్నారి నన్ను టైటానిక్ పాటను ప్లే చేయమని కోరింది. ఈ క్షణం చాలా అద్భుతంగా.. మనోహరంగా ఉందని పేర్కొన్నాడు. ఇదిలాఉంటే.. ఏంజెలికా క్యూట్ గర్ల్ మాత్రమే కాదు.. అసాధారణమైన ప్రతిభావంతురాలిని కూడా. మరోసారి ఈ వీడియో ద్వారా ఆమె ప్రతిభను చాటింది. గతంలో ఈ చిన్నారి పాట పాడిన వీడియోలు చాలా పాపులర్ అయ్యాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Emil Reinert (@emilio.piano)