WiFi Cut : 2000 మందికి WiFi లేకుండా చేసిన ఎలుకలు..రంగంలోకి దిగిన ప్రభుత్వ అధికారులు

లండన్ లో ఎలుకలు చేసిన ఘనకార్యానికి ప్రభుత్వ అధికారులు రంగంలోకి దిగారు. 2000 మందికి ఎలుకలు చుక్కలు చూపించాయి. దీంతో ప్రజలు అధికారులకు మొరపెట్టుకున్నారు.

london 2000 residents left without internet : ఎలుకలు ఎక్కడుంటే అక్కడ పంటలు నాశనమే. ఇష్టమొచ్చినట్లుగా తినేస్తుంటాయి. పాడు చేసేస్తుంటాయి. అవే ఎలుకలు ఇంట్లో ఉంటే బట్టలన్ని కొరికేస్తాయి.సరుకులు పాడుచేసేస్తుంటాయి. అంతేనా..కరెంట్ వైర్లు, ఎలక్ట్రిక్ వస్తువుల వైర్లు కొరికేస్తుంటాయి. అలా ఇంట్లో తిష్టవేసిన ఎలుకలు ఇంగ్లాండ్‌లోని టోరిడ్జ్‌, డేవాన్‌ ప్రాంతాలలో ఏకంగా 2000 మందికి చుక్కలు చూపెట్టాయి. ఇంటర్‌నెట్‌ కష్టాలు వచ్చేలా చేశాయి. టోరిడ్జ్‌, డేవాన్‌ ప్రాంతాలలో ఎలుకలు జనాలకు పిచ్చెక్కిస్తున్నాయి.

ఈ ప్రాంతాల్లో ఉండే ఎలుకల గుంపు ఇళ్లల్లో దూరి నానా హంగామా చేసి పారేస్తున్నాయి. ఇంటర్‌నెట్‌ కేబుళ్లను కొరికిపడేస్తున్నాయి. దీంతో జనాలు ఇంటర్నెట్ కనెక్షన్స్ కట్ అయి నానా తిప్పలు పడుతున్నారు. ఈ ఎలుకల వల్ల టోరిడ్జ్‌ ప్రాంతంలో 1800 మంది, డేవాన్‌ ప్రాంతంలో 200 మంది వరకు వైఫై సేవలు బంద్ అయిపోయాయి.

Read more : Pakistan Pm Imran selling gifts : దేశానికి వచ్చిన బహుమతుల్ని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమ్మేసుకుంటున్నారట..!

బీటీ, వొడాఫోన్‌, ప్లస్‌నెట్‌,స్కై, ఇతర కంపెనీల సేవలు అర్థాంతరంగా నిలిచిపోయాయి. అంతేగాక అక్టోబర్‌ 14న ఎలుకలు చేసిన హంగామాకు ఏడు గంటల పాటు కాల్స్‌ సేవలు నిలిచిపోయాయి. గత రెండు నెలల నుంచి ఆ ప్రాంత ప్రజలకు ఈ ఎలుకలతో పెద్ద తలనొప్పి వచ్చిపడుతోంది. ఇంటర్నెట్‌ సౌకర్యంగా సరిగా లేక నానా పాట్లు పడుతున్నారు.

దీనిపై స్థానిక ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. బిడ్‌ఫర్డ్‌, క్లోవెల్లీ, హార్ట్‌ల్యాండ్‌ ప్రాంతాల్లో టెలిఫోన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు నిలిచిపోయాయని..ఎలుకల వల్ల స్థానిక ప్రజలు 1800 మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.దీనిపై మాకు ఫిర్యాదు వచ్చాయనీ..దీంతో మా ఇంజనీర్లు ఈ సమస్యను పరిష్కరించటానికి తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. కానీ ఈ సమస్య పరిష్కారానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు.

Read more : Women Power : చిన్నారి మాటలకు ప్రియాంకా గాంధీ ఫిదా

ట్రెండింగ్ వార్తలు