Japan: స్వలింగ వివాహ బిల్లును ఆమోదించిన జపాన్ పార్లమెంట్ దిగువ సభ
300 కంటే ఎక్కువ జపనీస్ మునిసిపాలిటీలు ఇప్పుడు స్వలింగ జంటలు భాగస్వామ్య ఒప్పందాలలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. జపాన్ జనాభాలో వీరు 65 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ స్వలింగ వివాహాలపై హక్కులను సాధించడంలో వెనకబడి ఉన్నారు

LGBTQ+: జపాన్ పార్లమెంటులో ప్రవేశ పెట్టిన స్వలింగ వివాహానికి సంబంధించిన బిల్లును శక్తివంతమైన దిగువ సభ మంగళవారం ఆమోదించింది. ప్రధానమంత్రి ఫ్యూమియో కిషిడాకు చెందిన సంప్రదాయ పార్టీ ఈ బిల్లులో పలు సవరణలు చేసింది. అయితే దీనిపై ఒకవైపు తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న సమయంలో మరొకవైపు దిగువ సభ ఆమోదం తెలపడం గమనార్హం. గత శుక్రవారం దిగువ సభ కమిటీలో జరిగిన చర్చను అనుసరించి తాజా సవరణలు చేశారు. పార్లమెంటు ఎగువ సభలో కూడా ఈ బిల్లు ఆమోదం పొందుతుందని ప్రధాని కిషిద ఆశాభావం వ్యక్తం చేశారు.
వాస్తవానికి స్వలింగ సంపర్కులకు చట్టపరమైన రక్షణలు లేని ఏడు ప్రముఖ పారిశ్రామిక దేశాల సమూహంలో జపాన్ సభ్య దేశంగా ఉంది. వాస్తవానికి జపాన్‌లో స్వలింగ వివాహ చట్టానికి గతంలో వ్యతిరేకత బాగానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో మద్దతు చాలా పెరిగింది. అయితే అధికార పార్టీ అయిన లిబరల్ డెమొక్రటిక్ నుంచే వ్యతిరేకత బలంగా ఉండడం విశేషం. కొద్ది రోజుల క్రితం స్వలింగ వివాహాలపై జపాన్ ప్రజల నుంచి తీసుకున్న ఒపీనియన్ పోల్స్‌లో 70% మంది ప్రజలు స్వలింగ వివాహానికి మద్దతుగా ఓటు వేశారు.
Brij Bhushan Singh: రెజ్లర్లు గడువు ఇచ్చింది జూన్ 15 వరకే… బ్రిజ్ భూషణ్ ఏమన్నారంటే?
300 కంటే ఎక్కువ జపనీస్ మునిసిపాలిటీలు ఇప్పుడు స్వలింగ జంటలు భాగస్వామ్య ఒప్పందాలలో ప్రవేశించడానికి అనుమతిస్తున్నాయి. జపాన్ జనాభాలో వీరు 65 శాతం మంది ఉన్నారు. అయినప్పటికీ స్వలింగ వివాహాలపై హక్కులను సాధించడంలో వెనకబడి ఉన్నారు. స్వలింగ వివాహాన్ని అనుమతించినట్లయితే జపాన్ నుంచి ప్రజలు పారిపోతారని వివాదం రేకెత్తించిన ఒక నాయకుడిని ఫిబ్రవరిలో కిషిడా తొలగించారు. అయితే కోర్టులు ఇస్తున్న తీర్పులు తమకు ఊరట కలిగిస్తున్నాయి, అవి ప్రభుత్వం కల్లు తెరిపిస్తాయని స్వలింగ వివాహాలను సమర్ధించేవారు అంటున్నారు.