Brij Bhushan Singh: రెజ్లర్లు గడువు ఇచ్చింది జూన్ 15 వరకే… బ్రిజ్ భూషణ్ ఏమన్నారంటే?
దీనిపై బ్రిజ్ భూషణ్ సింగ్ మీడియాతో మాట్లాడారు.

Brij Bhushan Singh
Brij Bhushan Singh – Wrestlers : బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)పై రెజ్లర్ల పోరాటం కొనసాగుతోంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులకు రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. పోలీసులు త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. దీంతో దీనిపై బ్రిజ్ భూషణ్ సింగ్ స్పందించారు.
” ఛార్జిషీట్ దాఖలు చేయనివ్వండి.. దీనిపై నేను మాట్లాడేందుకు ఏమీ లేదు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. తీర్పు కోసం వేచిచూద్దాం ” అని బ్రిజ్ భూషన్ మీడియాకు చెప్పారు. తనపై ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఆయన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు, రెజ్లర్లు ఇచ్చిన జూన్ 15 గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారు తుది నిర్ణయం తీసుకుని అవకాశం ఉంది. బ్రిజ్ భూషణ్ నుంచి ఎదురైన లైంగిక వేధింపుల విషయంలో మళ్లీ ఆందోళనకు దిగాలా? అన్న విషయంపై జూన్ 15న తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఇటీవలే రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పింది.
రెజ్లర్లు రాజీపడాలంటూ తమపై చాలా ఒత్తిడి తీసుకొచ్చారని పేర్కొంది. బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాల్సిందేనని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయనను ఇప్పటికీ అరెస్టు చేయలేదు. దీంతో జూన్ 15 తర్వాత రెజ్లర్లు ఏ నిర్ణయం తీసుకుంటారన్న ఉత్కంఠ నెలకొంది.
Anand Mahindra : ఇలాంటి అద్భుతాన్ని భారత్‌లో చేయగలమా? : మంత్రి గడ్కరికీ ఆనంద్ మహీంద్రా ప్రశ్న