Maldives: ఇండియన్ టూరిస్టులు ఇలా చేస్తే మాల్దీవులకు వెళ్లిరావొచ్చు
దక్షిణాసియా దేశాల్లో మే15 నెల నుంచి టూరిస్టులకు డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నాయి మాల్దీవులు.

Maldives
Maldives: దక్షిణాసియా దేశాల్లో మే15 నెల నుంచి టూరిస్టులకు డోర్స్ క్లోజ్ అయిపోయాయి. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నాయి మాల్దీవులు. కొవిడ్-19 సెకండ్ వేవ్ నిబంధనలు సడలించిన తర్వాత నుంచి విదేశాలు కూడా భారత పర్యాటకులకు వెల్ కమ్ చెప్పేస్తున్నాయి.
రష్యా, టర్కీ, దక్షిణాఫ్రికా, మౌరిషియస్, ఐలాండ్, సెర్బియా, ఈజిప్ట్, అఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు కూడా బోర్డర్లు ఓపెన్ చేసి ఇండియన్ టూరిస్టులను స్వాగతిస్తున్నాయి. ఇటీవల కాలంలో భారత పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్న మాల్దీవులకు వెళ్లడానికి చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. జులై 15నుంచి ఎంట్రీకి ఎస్ అంటుండటంతో వెళ్లాలనుకునేవారు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.
1. negative RT-PCR report
టూరిస్టు 96గంటల ముందు ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకుని షెడ్యూల్ టైం కల్లా నెగెటివ్ రిపోర్టుతో ప్రయాణం మొదలుపెట్టాలి. లేదంటే వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా సరిపోతుంది. కాకపోతే ఇండియాలోని ప్రతి ఎయిర్‌పోర్టులో.. ప్రపంచవ్యాప్తంగా ఆర్టీ-పీసీఆర్ నెగెటివ్ రిపోర్టు కచ్చితం అని చెబుతున్నాయి.
2. Traveller health declaration
టూరిస్ట్ హెల్త్ డిక్లరేషన్ ఫామ్ కచ్చితంగా సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. హెల్త్ స్టేటస్ అప్ డేట్ చేస్తూ.. ఆర్టీపీసీఆర్ టెస్ట్ తో పాటు మాల్దీవ్స్ ఇమిగ్రేషనల్ పోర్టల్ లో కొన్ని పర్సనల్ డిటైల్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది.
3. Quarantine rules
జర్నీ మొదలుపెట్టబోయే ప్రయాణికుల్లో ఎవరికైనా కొవిడ్ లక్షణాలు కనిపిస్తే క్వారంటైన్ లో ఉండటం తప్పనిసరి. ఎవరైతే పూర్తిగా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకుంటారో వాళ్లకు మాత్రం ఎక్స్‌క్యూజ్ దొరుకుతుంది.
4. Visa
ఇండియన్ ట్రావెలర్లకు అక్కడకు చేరుకోగానే వీసా ఇస్తారు. ప్రయాణానికి ముందే ఎటువంటి వీసా అవసరం లేదు.
5. Accommodation
రిపోర్టుల ప్రకారం.. ఐలాండ్ చుట్టూ ఉన్న ప్రదేశాల్లోని హోటల్స్ లో ఐలాండ్స్ లో ఇండియన్లకు ఎంట్రీ లేదు. ఆ ప్రదేశానికి దూరంగా మాత్రమే అకమడేషన్ వంటి ఏర్పాట్లు చూసుకోవాలి.
మాల్దీవుల్లో లగ్జరీ రిసార్టుల గురించి తెలుసా..
1. Soneva Fushi
2. Ozen Maadhoo
3. JA Manafaru
4. Vakkaru Maldives
5. W Maldives
6. Velaa Resorts
7. Nautilus