సింహం పిల్ల కిడ్నాప్ చేసి పెంచుతున్న కోతి: వైరల్

  • Published By: veegamteam ,Published On : February 5, 2020 / 08:50 AM IST
సింహం పిల్ల కిడ్నాప్ చేసి పెంచుతున్న కోతి: వైరల్

Updated On : February 5, 2020 / 8:50 AM IST

దక్షిణాఫ్రికాలో  కృంగెర్ నేషనల్ పార్కులో ఒక బాబూన్ జాతికి చెందిన ఓ మగకోతి సింహం పిల్లను పెంచుతోంది. దీనికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోలో ఒక  కొండముచ్చు సింహం పిల్లను తన సొంత పిల్ల కంటే ఎక్కువగా చూసుకుంటోంది. ఈ ఫొటోను చూసేవారికి ఇది నిజమా? కాదా? అనే డౌట్ వస్తుంది. కానీ ఇది నిజం. 

Mankey 1

జంతువులు తమ జాతి వైరాన్ని మరచి స్నేహం చేసే ఎన్నో ఘటనల గురించి విన్నాం. చాలామంది చూసే ఉంటారు. అటువంటిదే ఈ సింహం..కోతి అనుబంధం. ఈ రెండు జంతువుల ఆప్యాయతకు సంబంధించిన ఫొటోలు నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలరిస్తోంది. 

22

కొండముచ్చు, సింహం పిల్లను  ఒక చెట్టు మీద కుర్చుని ఆటలాడుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. జూ పార్కులో సఫారీ నిర్వహించే కుర్త్ షట్లజ్ మాట్లాడుతూ తాను గత 20 ఏళ్లలో ఇటువంటి దృశ్యాన్ని ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ఆడుకుంటున్న సింహం పిల్లను ఆ కోతి ఎత్తుకొచ్చేసి ఉంటుందని అనుకుంటున్నారు. 

33

కాగా..సింహం పిల్లలతో ఆ కోతి గుంపు కూడా చక్కగా ఆడుకోవటం మరో విశేషం. కాగా ఆ కోతులు ఆ సింహం పిల్లతో ఆడుకునేటప్పుడు అది గాయపడే అవకాశాలున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.