Mali Gold Mine Collapse : మాలిలో తీవ్ర విషాదం.. నైరుతి కౌలికోరోలో కూలిన బంగారు గని.. 70మందికిపైగా మృతి

మాలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బంగారు గని కుప్పకూలిన సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు తెలిసింది.

Mali Gold Mine Collapse : మాలిలో తీవ్ర విషాదం.. నైరుతి కౌలికోరోలో కూలిన బంగారు గని.. 70మందికిపైగా మృతి

Mali Gold Mine Collapse

Updated On : January 25, 2024 / 7:44 AM IST

Mali Gold Mine : మాలిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నైరుతి కౌలికోరో ప్రాంతంలోని కంగబా జిల్లాలో గోల్డ్ మైన్ (బంగారు గని) కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 73మందికిపైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది మైనర్లు ఉన్నారు. మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఈ ఘటన నాలుగు రోజుల క్రితం జరిగినట్లు స్థానిక అధికారులు తెలిపారు. బంగారు గని కుప్పకూలిన సమయంలో అందులో 150 నుంచి 100 మంది వరకు ఉన్నట్లు మాలి చాంబర్ ఆఫ్ మైన్స్ అధ్యక్షుడు అబ్దులయే పోనా వెల్లడించారు. గని వద్ద సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఘోర ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Also Read : దొరికాడు.. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడు అరెస్ట్

ఆఫ్రియాలోని మూడో అతిపెద్ద బంగారు ఉత్పత్తిదారు అయిన మాలిలో ఇలాంటి ప్రమాదాలు సర్వసాధారణం. అయితే.. ఈసారిభారీ ప్రమాదం చోటు చేసుకుంది. తాజా ఘటనపై గనుల మంత్రిత్వ శాఖ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మైనింగ్ సైట్ ల సమీపంలో నివసించే మైనర్లు, కమ్యూనిటీలు భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉండాలని కోరింది. గని కూలిన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read : HMDA Balakrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ దాడులు

ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటిగా ఉన్న మాలి, ఆఫ్రికాలో బంగారు ఉత్పత్తిలో అగ్రగామిగా ఉంది. మాలి 2022లో 72.2 టన్నుల బంగారాన్ని ఉత్పత్తి చేసింది. ఈ లోహం జాతీయ బడ్జెట్ లో 25శాతం, ఎగుమతి ఆదాయాల్లో 75శాతం. 2023లో దాని జీడీపీలో 10శాతం దోహదపడిందని గతేడాది మార్చిలో అప్పటి గనుల శాఖ మంత్రి లామైన్ సేదౌ ట్రారే చెప్పారు. ఈ దేశంలో 10శాతం కంటే ఎక్కువ మంది తమ ఆదాయంకోసం మైనింగ్ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.