HMDA Balakrishna: హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో ఏసీబీ దాడులు
మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాలకృష్ణ ఇళ్లతో పాటు బంధువులు కార్యాలయాల్లో..

ACB Raids On HMDA Former Director Shiva Balakrishna
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ ఇళ్లలో అవినీతి నిరోధక శాఖ సోదాలు చేస్తోంది. వందల కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించింది. 14 టీమ్‌లతో బాలకృష్ణ ఇళ్లలో రైడ్ చేసింది ఏసీబీ. రేపు కూడా సోదాలు కొనసాగే అవకాశం ఉంది.
సోదాల్లో బాలకృష్ణ కుటుంబ సభ్యులు ఎవరూ సహకరించడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా ఆస్తులు, బంగారం, ఫ్లాట్స్, బాంక్ డిపాజిట్స్, బినామీల వివరాలను ఏసీబీ గుర్తించింది. ఇంకా బ్యాంక్ లాకర్స్, ఇతర ఆస్తులపై లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉంది.
ఆయన వద్ద ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేసింది ఏసీబీ. మొత్తం 20 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. బాలకృష్ణ ఇళ్లతో పాటు బంధువులు కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నామన్నారు. పదవిని అడ్డం పెట్టుకుని బాలకృష్ణ కోట్లాది రూపాయలు సంపాదించినట్లుగా ఏసీబీ గుర్తించింది.
హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో కీలక స్థానంలో పనిచేశారు బాలకృష్ణ. ఆయన కోట్లాది రూపాయలు కూడబెట్టినట్లు ఏసీబీ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణపై అవినీతి ఆరోపణలు కూడా వచ్చాయని, దీనిపై విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. బాలకృష్ణ ఏసీబీ విచారణకు సహకరించడం లేదని అన్నారు. ఇంట్లో డాక్యుమెంట్లు సీజ్ చేశామని తెలిపారు.
ALSO READ: కాంగ్రెస్ మరోసారి మా చెల్లిని ప్రయోగించింది.. ఇక బీజేపీ..: జగన్ సంచలన కామెంట్స్