Rescue Team : పిల్లిని కాపాడబోయి ప్రమాదంలో పడ్డ యజమాని.

న పెంపుడు పిల్లి ప్రమాదంలో ఉందని గమనించిన యజమాని దానిని రక్షించే ప్రయత్నం చేశాడు.. ఈ సమయంలో ప్రమాదంలో చిక్కుకున్నాడు. దీంతో పిల్లిని అతడి యజమానిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.. ఈ ఘటన అమెరికాలోకి Oklahoma (ఓక్లహోమా) నగరంలో చోటుచేసుకుంది

Rescue Team : పిల్లిని కాపాడబోయి ప్రమాదంలో పడ్డ యజమాని.

Rescue Team

Updated On : July 2, 2021 / 8:15 PM IST

Rescue Team : తన పెంపుడు పిల్లి ప్రమాదంలో ఉందని గమనించిన యజమాని దానిని రక్షించే ప్రయత్నం చేశాడు.. ఈ సమయంలో ప్రమాదంలో చిక్కుకున్నాడు. దీంతో పిల్లిని అతడి యజమానిని అగ్నిమాపక సిబ్బంది కాపాడారు.. ఈ ఘటన అమెరికాలోకి Oklahoma (ఓక్లహోమా) నగరంలో చోటుచేసుకుంది.

నగరానికి చెందిన ఓ వ్యక్తి పిల్లిని పెంచుకుంటున్నాడు. అది ఇంటి సమీపంలోని భారీ వృక్షాన్ని ఎక్కింది. అయితే దిగేందుకు వీలుకాకపోవడంతో అరవడం ప్రారంభించింది. పిల్లి ప్రమాదంలో ఉందని గమనించిన యజమాని దానిని రక్షించేందుకు చెట్టు ఎక్కాడు. పిల్లిని రక్షించేందుకు చెట్టు ఎక్కి చుక్కుల్లో పడ్డాడు. దిగేందుకు విలుకాకపోవడంతో కింద ఉన్న వారికి విషయం తెలిపాడు. దీంతో వారు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఘటన స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది. పొడవాటి నిచ్చన సాయంతో పిల్లిని దాని యజమానిని కిందకు దింపారు. ఇక ఈ రెస్క్యూకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిల్లిపై అతడికి ఉన్న ప్రేమను అందరు మెచ్చుకుంటున్నారు. అయితే దానిని రక్షించే సమయంలో మీ భద్రతా కూడా చూసుకుంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.