Air Canada flight : విమానం టేకాఫ్ అవుతుండగా కేబిన్ డోర్ నుంచి దూకిన ప్రయాణికుడు
ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుంచి కిందకు దూకిన ఘటన సంచలనం రేపింది. ఓ ప్రయాణీకుడు జనవరి 8వతేదీన టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కాడు. కానీ....

Air Canada flight
Air Canada flight : ఎయిర్ కెనడా విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు దుబాయ్‌కి బయలుదేరే ముందు విమానం నుంచి కిందకు దూకిన ఘటన సంచలనం రేపింది. ఓ ప్రయాణీకుడు జనవరి 8వతేదీన టొరంటో పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కాడు. కానీ తర్వాత తన సీటుపై కూర్చోకుండా క్యాబిన్ తలుపు తెరిచాడు. విమానం టేకాఫ్ అవుతుండగా క్యాబిన్ తలుపు నుంచి 20 అడుగుల పై నుంచి కిందకు దూకడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు.
ALSO READ : Farooq Abdullah : మనీలాండరింగ్ కేసులో ఫరూఖ్ అబ్దుల్లాకు ఈడీ సమన్లు
దీంతో పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన కారణంగా బోయింగ్ 747 టేకాఫ్‌కు ఆరు గంటలపాటు ఆలస్యమైంది. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని గ్రేటర్ టొరంటో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి చెందిన ఒక అధికారి చెప్పారు.
ALSO READ : Covid-19 : కొవిడ్ వైరస్‌తో డిసెంబరులో 10వేలమంది మృతి…ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి
తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కల్పించేలా ప్రవర్తించిన ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటారా? లేదా అనేది ఇంకా తేలలేదు. కొద్ది రోజుల క్రితం ఎయిర్ కెనడా విమానంలో 16 ఏళ్ల ప్రయాణికుడు కుటుంబ సభ్యులపై దాడి చేశాడు. ఎయిర్ కెనడా ఫ్లైట్ 137 టొరంటో నుండి కాల్గరీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చెప్పారు.