మిరాకిల్ గోల్డ్ ఫిష్ : నదిలో వదిలినా తిరిగి యజమాని దగ్గరకే ఎలా వచ్చేస్తోందో చూడండీ..

  • Published By: nagamani ,Published On : November 21, 2020 / 05:16 PM IST
మిరాకిల్ గోల్డ్ ఫిష్  : నదిలో వదిలినా తిరిగి యజమాని దగ్గరకే ఎలా వచ్చేస్తోందో చూడండీ..

Updated On : November 21, 2020 / 5:40 PM IST

man releases gold fish in the water but that comes back: మనుషులు పెంచుకునే కుక్కలకే విశ్వాసం ఉంటుందని ఇప్పటిదాకా అనుకున్నాం.కానీ చేపలకు కూడా విశ్వాసం ఉంటుందని అవి తమ యజమానిపై ప్రేమ పెంచుకుంటాయని.. తమకు స్వేచ్ఛ దొరికినా యజమానిని విడిచి వెళ్లవనీ ఓ గోల్డ్ ఫిష్ ను చూస్తే తెలుస్తుంది. మన ఇళ్లల్లో పెంచుకునే అక్వేరియంలలో ఉండే గోల్డ్ ఫిష్ ల గురించి తెలుసుకదూ. బంగారపు రంగులో చూడముచ్చటగా ఉంటాయి.



అటువంటి ఓ గోల్డ్ ఫిష్ ను నీటి కొలనులో వదిలినా..నాను ఇక్కడ ఉండను నీదగ్గరకే వచ్చేస్తానంటున్నట్లుగా ఆ గోల్డ్ ఫిష్ తిరిగి తన యజమాని దగ్గరకే వచ్చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదిచూసినవారంతా చేపలు కూడా తమ యజమానుల పట్ల ఇంత ప్రేమ పెంచుకంటాయా అంటున్నారు.


నీటిలో పెరిగే చేపలు కూడా తమ యజమానిని గుర్తు పెట్టుకుంటాయని, వాటికి కూడా విశ్వాసం ఉంటుందనే విషయం ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఓ వ్యక్తి తన ఆక్వారియంలోని చేపను తీసుకెళ్లి కొలనులో వదిలేశాడు. అయితే, ఆ చేప తిరిగి అతడి వైపుకే వచ్చేసింది.



ఇలా పలు సార్లు నీటిలోకి దూరంగా విసిరేసినా.. అది మాత్రం తిరిగి అతడి వద్దకే రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతున్న ఆ వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండీ…