Police Case : ఫేస్‌బుక్‌లో ఆ ఫోటో పోస్ట్ చేశాడు.. చివరకు కటకటాలపాలయ్యాడు

ఫేస్‌బుక్ పోస్టు ఓ వ్యక్తిని కటకటాలపాలు చేసింది. ఇంతకీ అతడేం పోస్టు చేశాడు.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.

Police Case : ఫేస్‌బుక్ పోస్టు ఓ వ్యక్తిని కటకటాలపాలు చేసింది. ఇంతకీ అతడేం పోస్టు చేశాడు.. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో ఇప్పుడు తెలుసుకుందాం.  అమెరికాలోని మిస్సోరీ చెందిన జేమ్స్ కర్ట్జ్ అనే వ్యక్తి మోటార్‌ వాహనాల్లో ఉపయోగించే కేటలిటిక్ కన్వర్టర్ అమ్మాలనుకున్నాడు. దాని ఫోటోను ఫేస్‌బుక్ మార్కెట్లో పోస్టు చేశాడు. అయితే ఈ ఫోటో చుట్టూ ఉన్న వస్తువులను తొలగించడం మర్చిపోయాడు.

Read More :   ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

అతడు పోస్టు చేసిన ఫొటోలో నిషేదిత డ్రగ్ మెథాంఫెటమైన్ కూడా ఉంది. దీనిని మెత్ అని కూడా పిలుస్తారు. అయితే ఈ నిషేదిత డ్రగ్ అతడు అమ్మాలనుకున్న కేటలిటిక్ కన్వర్టర్ పరికరం పక్కనే స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని ఫేస్‌బుక్‌లో చూసిన కొందరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన పోలీసులు అతడి ఇంటిపై రైడ్ చేశారు. ఇంట్లో 48గ్రాముల మెత్‌తో పాటు లైసెన్స్ లేని ఓ గన్ దొరికింది. రెండింటిని స్వాధీనం చేసుకొని జేమ్స్ కర్ట్జ్‌ని అరెస్ట్ చేశారు. ఇక ఈ పోస్టుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Read More : ఫేస్ బుక్‌ యూజర్లకు మళ్లీ టెక్నికల్ సమస్యలు..!

ట్రెండింగ్ వార్తలు