మాంచి కిక్ ఇచ్చే వీడియో : సింహాల మధ్యలో కూర్చుని గిటార్ వాయించిన యువకుడు

Man Sitting Next To The Chucky Lions Played

man sitting next to the chucky lions-played  : ఆ కిక్కే వేరబ్బా..అని ఎటువంటి సందర్భాల్లో అంటాం అంటే..ఇదిగో ఇలాంటప్పుడు మాత్రం కచ్చితంగా అనాల్సిందే..సింహాల పక్కన కూర్చొని…ఓ యువకుడి చక్కగా గిటార్ వాయించాడు. ఆ సింహాలు కూడా చక్కగా అతని గిటార్ వాయింపుని విన్నాయి. ఆ తరువాత చక్కగా నీళ్లు తాగాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. IFS ఆఫీసర్ సుశాంత నందా ఈ వీడియోను నెటిజన్ల కోసం షేర్ చేశారు. అందరూ అనుకున్నట్లుగానే ఈ వీడియో వైరల్ అయ్యింది. సింహాల పక్కన కూర్చొని ఓ యువకుడు చక్కగా గిటార్ వాయించేస్తున్నాడు.

ఇతర క్రూర మృగాలకంటే సింహాలు ఎప్పుడు ప్రత్యేకమైనవీ విభిన్నమైనవీను. సింహాలకు బాగా ఆకలేస్తేనే వాటాడతాయి. ఏదో కాలక్షేపం కోసమో..లేదా సరదా కోసం అస్సలు వేటాడవు. ఆకలేస్తే మాత్రం తన ముందున్న జంతువు ఎంతటిదైనా వదిలిపెట్టవు. చీల్చీ చెండాతాయంతే. అందుకే సింహం అడవికి మృగరాజు అయ్యింది.

సింహాల వీలైనంతవరకూ వేటాడేందుకు ఇష్టపడవు. కానీ వాటి కళ్లు, ముక్కు, చెవులు బాగా పనిచేస్తాయి. వేటాడాలి అని డిసైడ్ అయితే… సింహాలు చాలా యాక్టివ్ అయిపోతాయి. ఉరుకులు..పరుగులతో అస్సలు టైమ్ వేస్ట్ చేయవు..ఎక్కువ టైమ్ తీసుకోకుండా పని కానిచ్చేస్తాయి.

వేట మొదలు పెట్టాయంటే..సింహాలు తిరుగులేదు. గురి చూసిందంటే ఆ జంతువు వాటికి ఆహారం అయిపోవాల్సిందే… శత్రువు ప్రాణాలు హరీమనాల్సిందే. ..అందుకే సింహాలను అడవికి రారాజు అంటారు. కానీ ఈ వీడియోలో… అలాంటి సింహాల పక్కనే కూర్చొని సాంగ్ పాడుతున్నాడు. గిటార్ వాయిస్తున్నాడు. ఏంటి అతని ధైర్యం.? అనిపిస్తుంది…!!

ఈ వీడియోలో రెండు ఆడ సింహాలు, ఓ మగ సింహం ఉన్నాయి. ఓ పక్క అతను పాట పాడుతుంటే… అవి రొమాన్స్‌లో మునిగితేలుతున్నాయి. సరసాలాడుకున్నాయి. అంటే ఆ పాట వాటికి అంతలా నచ్చేసిందన్నమాట..కాసేపటి తర్వాత సింహం వాటర్ తాగుతుంటే… ఆ సౌంట్…ఆ గిటార్ సౌండ్ రెండూ కలిస్తే సరికొత్త మ్యూజిక్ అయినట్లుగా ఉంది..

ఇంతకీ సింహాల మధ్యన ఏమాత్రం భయం లేకుండా కూర్చుని గిటార్ వాయించిన అతని పేరు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.. అతని పేరు డీన్ ష్నీడర్.సౌతాఫ్రికాలో వైల్డ్ లైఫ్ స్పెషలిస్ట్. ఒకప్పుడు స్విట్జర్లాండ్‌లో పైనాన్షియల్ కంపెనీ ప్రారంభించి..2017లో సౌతాఫ్రికా వచ్చి… వైల్డ్‌లైఫ్ శాంక్చురీ ప్రారంభించాడు.

అక్కడ ఇలా సింహాలు, జీబ్రాలు, హైనాలు, బాబూన్లు వంటి రకరకాల జంతువుల్ని పెంచుతూ… వాటిని బాగా మచ్చిక అయిపోయాడు. వాటితో చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. అందుకే వాటి ముందు ఎన్ని డ్రామాలు చేస్తున్నా… అవి ఏమీ అనట్లేదు. ఎందుకంటే ఫ్రెండ్ కదా..