రెడీ ఫర్ షో టైం : మార్చి 25న Apple 2019 ఫస్ట్ స్పెషల్ ఈవెంట్ 

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తుల్లో రారాజు అయిన ఐటీ దిగ్గజం ఆపిల్ సంస్థ గ్రాండ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది.

  • Published By: sreehari ,Published On : March 14, 2019 / 02:10 PM IST
రెడీ ఫర్ షో టైం : మార్చి 25న Apple 2019 ఫస్ట్ స్పెషల్ ఈవెంట్ 

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తుల్లో రారాజు అయిన ఐటీ దిగ్గజం ఆపిల్ సంస్థ గ్రాండ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది.

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ ఉపకరణాల ఉత్పత్తుల్లో రారాజు అయిన ఐటీ దిగ్గజం ఆపిల్ సంస్థ గ్రాండ్ ఈవెంట్ కు రంగం సిద్ధమైంది. మార్చి 25న క్యూపర్టినో లోని స్టీవ్ జాబ్స్ థియేటర్ (ఆపిల్ పార్క్ క్యాంపస్) వేదికగా ఉదయం 10: 30 నుంచి ఆపిల్ స్పెషల్ ఈవెంట్ జరుగనుంది. 2019లో ఆపిల్ నిర్వహించబోయే తొలి ఈవెంట్ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ స్పెషల్ ఈవెంట్ సందర్భంగా ఆపిల్ ఎలాంటి కొత్త ప్రొడక్టులు, సర్వీసులను ఆవిష్కరిస్తుందోనని ఆపిల్ లవర్స్ అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. 2019 ఆపిల్ ఫస్ట్ ఈవెంట్ వేదికపై సంస్థ అధినేత టిమ్ కుక్ తో సహా ఆయన స్నేహితులు, ఐటీ ప్రముఖులు హాజరుకానున్నారు. ఆపిల్ 2019 ఈవెంట్ మొత్తాన్ని లైవ్ స్ట్రీమింగ్ పై వీక్షించాలంటే ఆపిల్ వెబ్ సైట్ లేదా ఆపిల్ టీవీ యాప్ ద్వారా వీక్షించవచ్చు.

ఆపిల్ సంస్థ ఒక ఏడాదిలో మూడు నుంచి నాలుగు ఈవెంట్లు నిర్వహిస్తుంటుంది. సమ్మర్ సీజన్ లో మార్చి నెలలో ఒక ఈవెంట్, జూన్ నెలలో వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫిరేన్స్ ఈవెంట్ నిర్వహిస్తు వస్తోంది. ఇక సెప్టెంబర్ ఈవెంట్ లో ఆపిల్ ఐఫోన్, ఆపిల్ వాచ్ కొత్త ప్రొడక్ట్ లను ప్రవేశపెడుతుంది. కొన్నిసార్లు అక్టోబర్ లో ఐప్యాడ్స్ లేదా మ్యాక్స్ గాడ్జెట్లను విడుదల చేస్తూ వస్తోంది. గతంలోనే ఆపిల్ గ్రాండ్ ఈవెంట్ పై ఎన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఫిబ్రవరిలోనే ఆపిల్ ఈవెంట్ నిర్వహించబోతుంటూ వార్తలు హల్ చల్ చేశాయి. చివరికి ఆపిల్ 2019 ఈవెంట్ ను మార్చి 25న ఖరారు చేసింది. ఈ ఏడాదిలో ఆపిల్ కొత్త ప్రొడక్టులు, న్యూ గాడ్జెట్లు, ఎలాంటి సర్వీసులను రిలీజ్ చేస్తుందోనే దానిపైనే అందరి దృష్టి పడింది.

ఆపిల్ 2019 షో టైమ్ ఈవెంట్ లో ముందుగా సాఫ్ట్ వేర్ సర్వీసులు, హార్డ్ వేర్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. అంతేకాదు.. కొత్త ఆపిల్ హార్డ్ వేర్ సర్వీసులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఆపిల్ పై వచ్చిన రూమర్ల ప్రకారం.. ఆపిల్ న్యూస్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసు, టీవీ స్ట్రీమింగ్ సర్వీసు, 10.2 అంగుళాల ఐప్యాడ్, ఐప్యాడ్ మిని 5, ఎయిర్ పాడ్స్ అపడేటడ్ వర్షన్ వంటి ఎన్నో సరికొత్త సర్వీసులను రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Apple న్యూస్.. Magazines సర్వీసు : 
ఆపిల్ కొత్త యూజర్ల కోసం న్యూస్ సర్వీసును తీసుకొస్తోంది. నెలవారీ సబ్ స్ర్కిప్షన్ పై 9.99 డాలర్లు ప్యాకేజీపై అన్ లిమిటెడ్ యాక్సస్ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ది న్యూ యార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్టు నుంచి స్పెషల్ స్టోరీలను ఈ న్యూస్ సర్వీసు ద్వారా అందించనుంది. ఇందులో మ్యాగజైన్ ఎలిమెంట్ కూడా ఉండనుంది. 2018లో ఇదే సర్వీసును మ్యాగజైన్ యాప్ ద్వారా టెక్చర్ అందించింది. ఆపిల్ కూడా తమ సర్వీసులో పాల్గొనే పబ్లిషర్లకు 9.99 డాలర్లకే అన్ లిమిటెడ్ మ్యాగజైన్ సర్వీసులను అందించనుంది. దీనిపై ఇంకా స్పష్టత లేదు. ఆపిల్ 50 శాతం సబ్ స్ర్కిప్షన్ రెవిన్యు ఉండేలా భావిస్తోంది. ఆపిల్ ప్లాన్ పై మ్యాగజైన్ పబ్లిషర్లు ఆతృతగా ఉన్నారు. 
Read Also : సెర్చ్ ఇమేజ్ ఫీచర్: మీ వాట్సాప్‌లో ఫొటోలు రియలో ఫేకో చెప్పేస్తుంది

Streaming TV సర్వీసు :
ఆపిల్ సరికొత్త సర్వీసును తీసుకోస్తోంది. అదే.. స్ట్రీమింగ్ టీవీ సర్వీసు. ఈ సర్వీసు ద్వారా కేబుల్ ఆపరేటర్ల నుంచి సబ్ స్ర్కిప్షన్ యాక్సస్ చేయనుంది. దీంతో రెండు డజన్లకు పైగా టీవీ షోలు, మూవీలను యూజర్లు వీక్షించే అవకాశం ఉంది. ఈ సర్వీసుపై ఆపిల్ ఎంత చార్జ్ చేస్తుందనేదానిపై క్లారిటీ లేదు. టీవీ సర్వీసును మార్చి ఈవెంట్ లోనే ఆపిల్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. టీవీ సర్వీసు ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆపిల్.. ఒరిజినల్ టెలివిజన్ షో సెలబ్రెటీలైన జెన్నీఫర్ అనిస్టాన్, స్టీవ్ కేరెల్, జెన్నీఫర్ గార్నెర్ హాజరయ్యే అవకాశం ఉంది. 

iOS 12.2 : 
iOS 12.2 బీటా వర్షన్.. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఆపిల్ న్యూస్ సర్వీసులో బీటా వర్షన్ చర్చకు వచ్చింది. ఆపిల్ ఈవెంట్ తర్వాత సంస్థ ఐఓఎస్ 12.2 అప్ డేట్ ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ సర్వీసు ద్వారా ఆపిల్ న్యూస్ సబ్ స్ర్కిప్షన్ సర్వీసును మరింత మంది యాక్సస్ చేసుకుంటారని ఆపిల్ భావిస్తోంది. ఐఓఎస్ 12.2 బీటా వర్షన్ తో పాటు ఆపిల్ న్యూస్ టూ కెనడా, కొత్త అనిమోజీ క్యారెక్టర్స్ ఆఫర్లను అందించనుంది. ఇందులో హోం కిట్ టీవీ సపోర్ట్ థర్డ్ పార్టీ టీవీలకు సపోర్ట్ చేసేలా డిజైన్ చేయనున్నారు. 
Read Also : పేటీఎం యూజర్ల పెద్ద మనస్సు : అమర జవాన్లకు రూ.47కోట్లు విరాళం

Apple Pay సర్వీసు  : 
బ్లూమ్ బెర్గ్ ప్రకారం.. కొత్త ఆపిల్ పే ఫీచర్లను ప్రదర్శనలో ఉంచేందుకు ప్లాన్ చేస్తోంది. మార్చి 25 ఈవెంట్ లోనే ఈ ఫీచర్లను లాంచ్ చేయాలని ఆపిల్ భావిస్తోంది. ఐఫోన్ క్రెడిట్ కార్డ్ గోల్డ్ మ్యాన్ శాచ్ పార్టనర్ షిప్ పై గ్రౌండ్ వర్క్ నడుస్తోంది. ఆపిల్ కొత్త ఫీచర్లను మొత్తం ప్రకటిస్తుందనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. కానీ, ఐఓఎస్ 12.2 వ్యాలెట్ యాప్ డిజైన్ పై కొన్ని అప్ డేట్లు తీసుకురానుంది. ఈ ఫీచర్లనే ఆపిల్ హైలెట్ చేయనుంది. 

హార్డ్ వేర్ సర్వీసు : 
ఆపిల్ అందించే పలు హార్డ్ వేర్ ప్రొడక్టులపై మైనర్ అప్ డేట్ అందించే అవకాశం ఉంది. ఇందులో ఐప్యాడ్, మిని ఐప్యాడ్, ఎయిర్ ప్యాడ్స్, ఐప్యాడ్ టచ్ ఉండగా, ఎయిర్ పవర్ కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. సర్వీసులపై దృష్టిపెట్టిన ఆపిల్ 2019 ఈవెంట్ లో హార్డ్ వేర్ అప్ డేట్లపై ఎలాంటి ప్రకటన వెలువడే అవకాశం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈవెంట్ ముగిశాక ఆపిల్.. ఈ అప్ డేట్లు అన్నింటిపై ఒకేసారి ప్రెస్ రిలీజ్ లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.  
March 2019 Apple Event: What to Expect from Apple products and Services of the year