ఫ్లోరిడా: వెర్రి విధాలంటారు. పిచ్చి పలు రకాలు అని కూడా అంటారు. పిచ్చి..వెర్రి కలిపితే ఓ జంట వింత పద్ధతిలో చేసుకున్న వివాహం వైరల్ గా మారింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఓ మినీ ఆటో..దాని వెనుకే చిన్న పందిరి వేసుకుని పెళ్లి చేసుకున్నారు..ఇదీ కూడా ఓ విశేషమేనా అంటు పెదవి విరిచేస్తున్నారా..కాదు..కాదు కాస్త ఆగితే ఈ వింత వివాహం చూసి మీరు కూడా ముక్కుమీద వేలేసుకుంటారు. సాధారణంగా పెళ్లి కూతురు ఆయా కులాలు..సంప్రదాయాల ప్రకారంగా ముస్తాబవుతుంది. కానీ మనం చెప్పుకునే ఈ పెళ్లి కూతురు మాత్రం బికినీ వేసుకొని ఉంది. పెళ్లి కొడుకు కూడా ఏమీ తర్కువ తినలేదండోయ్..పెళ్లి కొడుక్కూడా షర్ట్ వేసుకోకుండానే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు.
బికినీలోని పెళ్లి కూతుర్ని పెళ్లిచేసుకొన్న అతను.. మినీ ఆటోలోంచి ఆమెను కిందకు అపురూపంగా దించాడు. తరువాత ఇంకాస్త అపురూపంగా ఎత్తుకొని ముద్దులు కూడా పెట్టుకున్నాడు. అంతే అమాంతంగా ఆమెను తీసుకెళ్లి ఓ బురదగుంటలో పడేశాడు. తను కూడా బురదగుంటలో దూకేసి..ఆమెను ముద్దులతో ముంచెత్తాడు. ఈ వింత వివాహానికి హాజరైన వారి మిత్రులు ఈ తతంగాన్నంతా కెమెరాల్లో బంధించారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ఇప్పటికే దాదాపు లక్షమంది దీన్ని షేర్ చేసారు. ఎవరి ఇష్టం వారిది అన్నట్లు ఎవరి పద్ధతులు వారివే అయినా ఇటువంటి వింత..విచిత్ర వివాహాలు