Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. భయంతో వణికిపోయిన జనం

భారీ భూకంపం రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకం తీవ్రత 6.2గా నమోదైంది. రాజధాని ఇస్తాంబుల్‌కు 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అయితే ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు తెలియరాలేదు.

6.2 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి ఇస్తాంబుల్ వణికిపోయింది. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషాలకు భూకంపం వచ్చిందని.. తీవ్రత ఎక్కువగా ఉందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చినట్లు నిర్ధారించింది యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే.

ఇస్తాంబుల్‌కు నైరుతి దిశలో దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో మర్మారా సముద్రంలో భూకంప కేంద్రం ఉందని చెప్పింది. నివేదికల ప్రకారం, టర్నీకి పొరుగున ఉన్న అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. టర్కీలో రెండు ప్రధాన ఫాల్ట్ రేఖలు ఉన్నాయని, దీని వలన అక్కడ భూకంపాలు సర్వసాధారణం అని నిపుణులు తెలిపారు.

Also Read: హృదయవిదారకం.. ఉగ్రవాదులేమో అనుకుని.. నిజమైన భారత ఆర్మీని చూసి భయంతో వణికిపోయిన పర్యాటకులు..

కాగా, టర్కీలో గతంలోనూ భూకంపాలు సంభవించాయి. ఫిబ్రవరి 6, 2023న 7.8 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొన్ని గంటల్లోనే మరో శక్తివంతమైన భూకంపం సంభవించి టర్కీలోని 11 దక్షిణ, ఆగ్నేయ ప్రావిన్సులలో భారీ విధ్వంసం సృష్టించింది. దీని ఫలితంగా 53వేల మందికి పైగా మరణించారు. పొరుగున ఉన్న సిరియా ఉత్తర ప్రాంతాలలో 6వేల మంది మరణించారు.

భారీ భూకంపం రావడంతో ఆ దేశ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సురక్షిత ప్రాంతాల వైపు వెళ్లారు. కాగా, ఎప్పుడు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. అటు అధికారులు అలర్ట్ అయ్యారు. ముందు జాగ్రత్తగా భారీ భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

 

 

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here