China: చైనాలోని కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆకాశాన్ని తాకిన నిప్పుల పొగ
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సిలికాన్ ఆయిల్‌లో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా మంటలను అదుపు చేశారు. సమీపంలోని నివాసితులను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉండాలని కోరారు

Fire Erupt Chemical Plant: చైనాలోని జియాంగ్సీ అనే తూర్పు ప్రావిన్స్‌లోని గుయిక్సీలోని ఒక రసాయన కర్మాగారంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పేలుడు కారణంగా సంభవించిన మంటలు, దట్టమైన నల్లటి పొగ ఆకాశాన్ని తాకాయి. దీంతో వెంటనే అత్యవసర సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యల్లో మునిగిపోయిందని చైనా పీపుల్స్ మీడియా వెల్లడించింది. అగ్నిప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి, తదుపరి నష్టం జరగకుండా నిరోధించడానికి అధికారులు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిలికాన్ ఆయిల్ ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగిన జియాంగ్సీ కియాన్‌టై న్యూ మెటీరియల్స్ యాజమాన్యంలోని ప్లాంట్‌లో శనివారం మధ్యాహ్నం సమయంలో పేలుడు సంభవించి ఉంటుందని అనుమానిస్తున్నారు. చైనీస్ స్టేట్ మీడియా అవుట్‌లెట్ సీసీటీవీ ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో ప్రసారం చేసింది.
Not Russia this time, China ?? ❗
Powerful explosion ? ? rocked a chemical plant in China. Lit factory in Jiangxi Province, there may be casualties. Emergency services are trying to put out the fire. The causes of the explosion are still unknown. pic.twitter.com/RPZQUJRGwq— LX (@LXSummer1) July 1, 2023
Mumbai : ముంబయిలో భారీగా క్యూ కట్టిన ప్రజలు .. దేని కోసమో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ప్రాథమిక నివేదికల ప్రకారం.. సిలికాన్ ఆయిల్‌లో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది ధైర్యంగా మంటలను అదుపు చేశారు. సమీపంలోని నివాసితులను ఆ ప్రాంతం నుండి దూరంగా ఉండాలని కోరారు. ప్లాంట్‌కు సమీపంలో నివసించే వ్యక్తులను తక్షణమే తరలించడం వల్ల ఎలాంటి గాయాలు కాకుండా, ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Uttar Pradesh: గర్ల్‌ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన అబ్బాయిని కొట్టి చంపిన కుటుంబీకులు
చెలరేగుతున్న మంటలను నియంత్రించడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై అధికారులు సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా నిరోధించడానికి, పరిశ్రమలో భద్రతా చర్యలను మెరుగుపరచడానికి అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యమని అధికారులు అన్నారు.