Alcohol Drinking: తాగడానికి, తినడానికి పీజీ కోర్స్ ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీ
చిన్నప్పటి నుంచి చేసే పనే. తినడం, తాగడం అనేవి పెరిగిన వాతావరణం, పాటించే అలవాట్లను బట్టి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ కు తగ్గట్లుగా ఫాలో అయిపోతుంటాం. కానీ, ఈ యూనివర్సిటీలో ఆఫర్....

Drinking
Alcohol Drinking: చిన్నప్పటి నుంచి చేసే పనే. తినడం, తాగడం అనేవి పెరిగిన వాతావరణం, పాటించే అలవాట్లను బట్టి ఉంటుంది. మన లైఫ్ స్టైల్ కు తగ్గట్లుగా ఫాలో అయిపోతుంటాం. కానీ, ఈ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్న తాగడం, తినడం, సమాజంలో తిరగడం వంటివి నేర్పుతుంది యూనివర్సిటీ.
ఫ్రాన్స్ లోని ఓ టాప్ యూనివర్సిటీ ఈ అంశాలను చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రత్యేకించి దీని కోసమే మాస్టర్ డిగ్రీ కోర్స్ ఆఫర్ చేస్తుంది. ఎవరైతే వ్యక్తి తినడం, తాగడం, సామాజికంగా తిరగడం వంటివి ఎంజాయ్ చేస్తారో.. వారికి Po Lille నుంచి మాస్టర్ డిగ్రీ అందుకోవచ్చు.
ఈ కోర్సు పేరెంటో తెలుసా.. BMV. అంటే బోయిరె, మ్యాంగర్, వివ్రే. అంటే ఫుడ్, డ్రింక్స్, లివింగ్ గురించి టాపిక్స్ కవర్ చేస్తుందట. దాంతో పాటు గ్యాస్ట్రో- డిప్లమసీ, ఫుడ్ టెక్, ఫైటింగ్ సెక్సిజం లాంటి అంశాలను కవర్ చేస్తుందట.
ఇది కూడా చదవండి : మిధాని హైదరాబాద్ లో పోస్టుల భర్తీ
ఇవే కాకుండా లైఫ్ స్టైల్, మాంసానికి బదులుగా ఏయే కూరగాయలు తీసుకోవచ్చు, వ్యవసాయం, లాంటి కాన్ఫిరెన్స్ లకు అటెండ్ కావచ్చు. పలు ప్లాట్ ఫాంల నుంచి వచ్చే ఒకే అభిరుచి ఉండే వాళ్లంతా ఒకటి కావొచ్చని యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ చెబుతున్నారు.