వలస పక్షులను రక్షిద్దాం

మే 11 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం.పక్షులు సంతానోత్పత్తి కోసం వలసలు వెళుతుంటాయి. అలాగే ఆయా ప్రాంతాలలు ఆహారం కొరత.. వాతావరణ పరిస్థితులు వంటి పలు కారణాలతో పక్షులు మరోచోటికి వలసపోతుంటాయి.

  • Publish Date - May 11, 2019 / 10:10 AM IST

మే 11 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం.పక్షులు సంతానోత్పత్తి కోసం వలసలు వెళుతుంటాయి. అలాగే ఆయా ప్రాంతాలలు ఆహారం కొరత.. వాతావరణ పరిస్థితులు వంటి పలు కారణాలతో పక్షులు మరోచోటికి వలసపోతుంటాయి.

2019 ఏడాదిలో మే 11 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం వచ్చింది. ప్రతి ఏటా మే నెలలో వచ్చే రెండో శనివారాన్ని ఈ దినోత్సవంగా జరుపుకుంటారు. పక్షులు సంతానోత్పత్తి కోసం వలసలు వెళుతుంటాయి. అలాగే ఆయా ప్రాంతాల్లో ఆహారం కొరత..లేదా వాతావరణ పరిస్థితులు వంటి కారణాలతో పక్షులు మరోచోటికి వలసపోతుంటాయి. ఫ్లెమింగోలు, స్టార్కు జాతి కొంగలు, పెలికాను పక్షులు, గద్ధ వంటి అనేక జాతుల పక్షులు సుదూరం ప్రయాణిస్తాయి. ఆయా ప్రాంతాలకు వలస వచ్చే పక్షుల కోసం ఆ ప్రాంత  ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. వలస పక్షులకు ఆయా ప్రాంతాల అభివృద్ధితోనూ ముడిపడి ఉంటుంది.

వలస పక్షుల దినోత్సవం ప్రత్యేకత 
యూనెస్కో 2006 నుంచి వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. పక్షుల అవసరాలు, అలవాట్లు, వలస వెళ్లే ప్రాంతాల్లో వాటికి ఎదురవుతున్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వలస పక్షుల ప్రదేశాల రక్షణ గురించి ప్రచారం చేస్తూ స్తానికుల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. 

ప్రపంచ వారసత్వ ప్రాంతాలకు వ్యర్థ పదార్ధాలు, కాలుష్యం వంటి కారణంగా నష్టం జరుగుతుంది. రోజు రోజుకు పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. ప్లాస్టిక్, ఇతర వస్తువులను ఇష్టానుసారం వేయకుండా వలస పక్షులను కాపాడాల్సిన బాధ్యత కూడా పర్యాటకులపై ఉందంటూ సూచించింది యూనెస్కో. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు పక్షులకు విరామ స్థలాలుగా ఉంటున్నాయి. పలు వారసత్వ ప్రదేశాల్లో జల కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంటుంది. ప్లాస్టిక్, పారిశ్రామిక వ్యర్థాలు పక్షుల ప్రాణాలకు ముప్పుగా మారాయి.