కోవిడ్ 19 వ్యాక్సిన్ కోసం తన ప్రాణాలను పణంగా పెట్టిన భారతీయ వ్యక్తి దీపక్ పాలీవాల్

కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలన్ని వణికిపోతూనే ఉన్నాయి. రోజు రోజుకు ఈ మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. గతేడాది చివర్లో చైనాలో తొలిసారిగా వెలుగులోకి వచ్చి యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. ఈ మహమ్మారికి పూర్తిగా చెక్ పెట్టేందుకు ఇప్పటికే పలు దేశాలు వాక్సిన్ అభివృద్ధి పనులను వేగవంతం చేసిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగానే కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో పనిలో తన వంతు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు భారత దేశానికి చెందిన దీపక్ పాలీవాల్ తెలిపారు. ఆ సమయంలోనే ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో కరోనా వైరస్ ట్రయల్స్ జరుగుతున్నాయని, దాని కోసం వాలంటీర్ల అవసరం ఉందని నా స్నేహితుల ద్వారా తెలిసింది. దాంతో రెండవ ఆలోచన లేకుండా స్వయంగా హ్యూమన్ ట్రయల్స్ కోసం తాను అప్లై చేశాను అని బిబిసికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దీపక్ తెలిపారు. అంతేకాకుండా తన మెుదడు వల్ల ఎటువంటి ఉపయోగం లేకపోయినా నా శరీరమైనా ఉపయోగపడుతుందని అన్నారు.
జైపూర్‌లో పుట్టి, ప్రస్తుతం లండన్‌లో ఉంటున్న దీపక్ పాలీవాల్, తనకు తానుగా వాలంటీర్ కావాలనుకున్న కొద్దిమందిలో ఒకరు. వీలైనంత త్వరగా కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను తయారుచేయాలని ప్రపంచ దేశాలన్ని కోరుకుంటున్నాయి. అమెరికా, బ్రిటన్, చైనా, భారత్ లాంటి పెద్ద దేశాలన్నీ అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. ఏ దేశం మెుదట టీకా ను తయారు చేస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రతి టీకా తయారీకి ముందుగా ‘హ్యూమన్ ట్రయల్స్’అవసరం. కానీ ఈ వ్యాక్సిన్ ట్రయల్ కోసం మీరు ముందుకు వస్తారా? అని అడిగితే మనలో చాలా మంది నో అనే సమాధానమే చెబుతారు. కానీ దీపక్ లాంటి వాలంటీర్ల వల్ల వ్యాక్సిన్ ట్రయల్ వేగవంతం అవుతున్నాయి.
దీపక్ తనను ఏప్రిల్ 16న నాకు మొదటిసారి కరోనా వ్యాక్సిన్ ట్రయల్ కోసం వాలంటీరుగా వెళ్లవచ్చని తెలిసింది. నా భార్యకు అది చెప్పగానే ఆమె అసలు ఒప్పుకోలేదు. భారత్‌లో ఉన్న మా కుటుంబ సభ్యులకు కూడా నేనేం చెప్పలేదు. వాళ్లు కూడా దానికి ఒప్పుకోరని నాకు తెలుసు. అందుకే నేను నా క్లోజ్ ఫ్రెండ్స్‌తో మాత్రమే ఆ విషయం షేర్ చేసుకున్నా” అన్నారు దీపక్. అంతేకాకుండా తర్వాత చెకప్ కోసం మీరు మా సెంటర్ కు రావాల్సి ఉంటుందని చెప్పారు. దాని కోసం ఐదు సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యాక్సిన్ ట్రయల్ జరుగుతున్నప్పుడు ఒక వాలంటీర్ చనిపోయాడని, నేను వ్యాక్సిన్ మొదటి షాట్ కోసం వెళ్లాల్సిన రోజు నాకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందని దీపక్ చెప్పారు. ఆస్పత్రిలో కొన్ని వీడియోలు కూడా చూపించారు. కానీ ఇవన్నీ నా సంకల్పం ముందు నిలవలేకపోయ్యాయి అని దీపక్ అన్నారు.
రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన దీపక్ పాలీవాల్(42), అతని భార్యతో కలిసి లండన్ లో నివసిస్తున్నాడు. ఆయన లండన్‌లో ఒక ఫార్మా కంపెనీలో కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. భారత్‌లోనే పుట్టి పెరిగిన దీపక్ కుటుంబం ఇప్పటికీ జైపూర్‌లోనే ఉంటున్నారు. దీపక్ భార్య కూడా ఫార్మా కంపెనీలోనే పనిచేస్తుంది. వ్యాక్సిన్ ట్రయల్స్ డోస్ తీసుకున్న తర్వాత కూడా ఆయన తనవాళ్లకు ఆ విషయం గురించి చెప్పలేదు. ఆ విషయం తెలిసిన తర్వాత తల్లి, అన్న తన నిర్ణయాన్ని మెచ్చుకున్నా, అక్కయ్యకు దీపక్ మీద చాలా కోపం వచ్చింది.
దీపక్ భార్య పర్ల్ డిసౌజా బీబీసీతో మాట్లాడుతూ, దీపక్ నిర్ణయం పట్ల తను సంతోషంగా లేనని చెప్పారు. ఒకసారి ఒప్పుకున్నా, కానీ ఇంకోసారి అలాంటి వాటిని అంగీకరించేది లేదు అని తెలిపింది. దీపక్ ట్రయల్ పార్ట్ పూర్తి అయ్యింది. కానీ ఆక్స్ ఫర్డ్ ట్రయల్లో ఇప్పుడు కూడా 10 వేల మందిపై ఇంకా ట్రయల్ జరుగుతూనే ఉన్నాయి. మొత్తం ప్రపంచం లాగే, వ్యాక్సిన్ విజయవంతం అయ్యే రోజు కోసం దీపక్ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాడు.