విడాకులు తీసుకుని ట్రంప్‌‌తో విడిపోతే.. మెలానియాకు భారీ పరిహారం

  • Published By: vamsi ,Published On : November 12, 2020 / 11:15 AM IST
విడాకులు తీసుకుని ట్రంప్‌‌తో విడిపోతే.. మెలానియాకు భారీ పరిహారం

Updated On : November 12, 2020 / 11:39 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తర్వాత ట్రంప్ గురించి వస్తున్న వార్తల్లో ఒకటి అతను భార్య మెలానియా ట్రంప్ నుంచి విడిపోవడం. ట్రంప్ విడాకులు తీసుకుని భార్య మెలానియా ట్రంప్‌ నుంచి విడిపోతున్నట్లుగా వార్తలు అంతర్జాతీయంగా వస్తున్నాయి. ట్రంప్ 15 ఏళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలికేందుకు మెలానియా కూడా ఎదురుచూస్తున్నట్లుగా ట్రంప్‌ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్‌ చెప్పింది. ఈ విషయాన్ని డెయిలీ మెయిల్‌ వెల్లడించగా.. ఇప్పుడు ట్రంప్‌కు విడాకులు ఇవ్వడానికి సిద్ధం అయిన మెలానియా ట్రంప్‌కు వచ్చే పరిహారం విషయంలో న్యాయ నిపుణులు ఎంత వస్తుందనేదానిపై గట్టి అంచనాలే వేస్తున్నారు.



ఇప్పటికే ఒమరోసా పలు కీలక విషయాలు వెల్లడించగా.. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధమే లేదని, అవసరం కోసం కలిసి బతికేస్తున్నారు అని ఒమరోసా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ట్రంప్‌ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు అందే భరణం గురించి న్యాయ నిపుణులు అంచనా వేసేశారు. ట్రంప్ నుంచి విడాకులు తీసుకుంటే మెలానియాకు 68 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 500కోట్లకు పైన పరిహారం రావచ్చునని న్యాయనిపుణులు అంటున్నారు.



న్యూమాన్ రాడ్ మేనేజింగ్ భాగస్వామి జాక్వెలిన్ న్యూమాన్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వారిద్దరికి 14 ఏళ్ల బారన్ ట్రంప్ అనే కొడుకు ఉన్నాడు కాబట్టి మెలానియాకు అందే ప్రాధమిక కస్టోడియల్ హక్కులన్నీ అతనికి లభిస్తాయని న్యూమాన్ తెలిపారు. డొనాల్డ్‌ ట్రంప్‌కు మెలానియా మూడవ భార్య. అయితే ట్రంప్‌ మాజీ భార్యల కంటే ఇప్పుడు మెలానియాకు చాలా ఎక్కువ మొత్తంలో భరణం అందబోతుంది. మొదటి భార్యకు 14 మిలియన్‌ డాలర్లు, రెండవ భార్యకు 2మిలియన్‌ డాలర్లు భరణం కింద అందగా.. ఇప్పుడు మెలానియాకు మాత్రం 68 మిలియన్‌ డాలర్లు అందే అవకాశం కనిపిస్తుంది.



అయితే అసలు ట్రంప్ విడాకులు తీసుకోవడం నిజమేనా? నివేదికలు నిజంగా నిజమే అయితే, ట్రంప్‌తో విడాకులు తీసుకోవాలని మెలానియా ఎందుకు కోరుకుంటుంది? ట్రంప్ ఓడిపోయే వరకు మెలానియా ఎందుకు వేచి ఉన్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.