పారిపోతున్న పులిని మడత కుర్చీ, తాడుతో ఎలా బంధించారో చూడండి

  • Published By: srihari ,Published On : May 15, 2020 / 01:14 PM IST
పారిపోతున్న పులిని మడత కుర్చీ, తాడుతో ఎలా బంధించారో చూడండి

Updated On : May 15, 2020 / 1:14 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో జూపార్కులు మూసివేయటంతో వాటికి ఆహారం ఇచ్చేవారు లేకపోవటంతో జంతువులు ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకుని రోడ్లపై పరుగులు తీస్తున్నాయి. తాజాగా ఒక పులి ఎన్ క్లోజర్ నుంచి తప్పించుకుని రోడ్డుపై పరుగులు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మెక్సికోలోని జాలిస్కో ప్రాంతంలోని ఉన్న జూపార్కు ఎన్ క్లోజర్ నుంచి పులి తప్పించుకుని రోడ్డు మీదకు పరుగులు పెట్టింది. పులిని పట్టుకోవడానికి ముగ్గురు వ్యక్తులు  దాని వెనకాల పరుగులు పెట్టడం వీడియోలో కనిపిస్తోంది. అందులో ఒక వ్యక్తి కౌబాయ్ టోపిని పెట్టుకుని, తాడు సహాయంతో పులి బంధించటానికి ప్రయత్నిస్తాడు. పులి వేగంగా పరిగెడుతూ ముందుకు వెళ్తుంది. ఆ ముగ్గురులో ఓ వ్యక్తి అది ఎక్కువ దూరం వెళ్లకుండా మడత కుర్చీ సహాయంతో ఆపేస్తాడు. దాంతో టోపి పెట్టుకున్న వ్యక్తి తన చేతిలోని తాడును పులి మెడకు చుట్టుకునేలా విసురుతాడు. పులి తాడును బలంగా లాగటంతో తాడుకు చిక్కినట్లే కనిపిస్తుంది. కానీ పులి తాడుకు చిక్కిందా లేదా అన్న విషయం తెలిసే లోపే వీడియో ఎండ్ అయింది. 

ఈ వీడియోని carlosWME అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోని వేలాది మంది వీక్షించారు. ఓ నెటిజన్ టైగర్ క్యాచింగ్ స్టార్టర్ కిట్, మడత కుర్చీ , తాడు ఉండగా భయం ఎందుకు అని ట్వీట్ చేశాడు.