Meta employee-Zuckerberg: తనను ఉద్యోగం నుంచి తీసేసిన జుకర్‌బర్గ్ కు మహిళ సూటి ప్రశ్న
ఆండీ అలెన్ అనే మహిళ ఓ పోస్ట్ చేశారు. తాను ప్రసూతి సెలవుల్లో ఉన్న సమయంలో ఉద్యోగం నుంచి తొలగించారని, అసలు వేలాది మంది ఉద్యోగులను తీసేయాలని మెటా తప్పుడు లెక్కలు వేసుకోవడం ఏంటని నిలదీశారు. మరి, మార్క్ జుకర్ బర్గ్ తన వేతనాన్ని తగ్గించుకున్నారా? అని ప్రశ్నించారు.

Meta employee-Zuckerberg: ప్రసూతి సెలవుల్లో ఉన్న ఓ మెటా ఉద్యోగిని ఆ సమయంలో ఉద్యోగాన్ని కోల్పోయారు. దీంతో ఆమె తన బాధను తెలుపుతూ, మెటా సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ను నిలదీస్తూ లింక్డ్ఇన్ లో ఓ పోస్ట్ చేశారు. మెటా ఇటీవలే 10,000 మందికి లే-ఆఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. 2022 నవంబరులోనూ 11,000 మందికి లే-ఆఫ్ ఇచ్చింది. మెటా ఉద్యోగం తొలగించడంతో తన బాధను వివరిస్తూ చాలా మంది లింక్డ్ఇన్ లో పోస్టులు చేస్తున్నారు.
తాజాగా ఆండీ అలెన్ అనే మహిళ ఓ పోస్ట్ చేశారు. తాను ప్రసూతి సెలవుల్లో ఉన్న సమయంలో ఉద్యోగం నుంచి తొలగించారని, అసలు వేలాది మంది ఉద్యోగులను తీసేయాలని మెటా తప్పుడు లెక్కలు వేసుకోవడం ఏంటని నిలదీశారు. మరి, మార్క్ జుకర్ బర్గ్ తన వేతనాన్ని తగ్గించుకున్నారా? అని ప్రశ్నించారు. మార్కెట్లో చోటుచేసుకుంటున్న మార్పులు, ప్రస్తుత పరిణామాల గురించి తాను అర్థం చేసుకోగలనని అన్నారు.
అయితే, మెటా నాయకత్వం తప్పుగా లెక్కలు వేసుకుని వేలాది మందికి లే-ఆఫ్ ఇవ్వడం గురించి మాత్రం అర్థం కావట్లేదని చెప్పారు. తమ కోసం పనిచేస్తున్న వారి గురించి మెటా పట్టించుకోవట్లేదని విమర్శించారు. “మెటాలోని నా రిక్రూటింగ్ టీమ్ అద్భుతంగా పనిచేస్తోంది. అయితే, మెటా ప్రస్తుత పరిస్థితుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మాత్రం భయంకరంగా ఉంది” అని ఆమె అన్నారు.
H-1B workers: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఉపశమనం!