H-1B workers: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఉపశమనం!

ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని అంచనాలు నెలకొన్న వేళ అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి శుభవార్త. హెచ్-1బీ వీసాదారుల గ్రేస్ పీరియడ్ పెంచాలని అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది. ఎవరైనా అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోల్పోయి, ఖాళీగా ఉంటే ఆ దేశాన్ని 60 రోజుల్లో విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. తాజాగా, అధ్యక్ష సలహా ఉపసంఘం ఆ 60 రోజుల గడువును 180 రోజులకు పొడిగించాలని సిఫార్సు చేసింది.

H-1B workers: అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఉపశమనం!

Laid-off H-1B workers

H-1B workers: ఆర్థిక సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని అంచనాలు నెలకొన్న వేళ అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి శుభవార్త. హెచ్-1బీ వీసాదారుల గ్రేస్ పీరియడ్ పెంచాలని అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేసింది. ఎవరైనా అమెరికాలో ఉంటూ ఉద్యోగం కోల్పోయి, ఖాళీగా ఉంటే ఆ దేశాన్ని 60 రోజుల్లో విడిచి వెళ్లిపోవాల్సి ఉంటుంది. తాజాగా, అధ్యక్ష సలహా ఉపసంఘం ఆ 60 రోజుల గడువును 180 రోజులకు పొడిగించాలని సిఫార్సు చేసింది.

ఈ సిఫార్సులు అమల్లోకి వస్తే అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన విదేశీయులకు భారీ ఊరట కలగనుంది. గత ఆరు నెలల్లో అమెరికా సంస్థలు చాలా మందికి లే-ఆఫ్ లు ఇచ్చాయి. దీంతో, ఆయా హెచ్-1బీ వీసాలతో అమెరికాలో ఉంటున్న ఉద్యోగులు కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సి వస్తోంది. అయితే, గ్రేస్ పీరియడ్ 60 రోజులే ఉండడంతో ఆ గడువులోపు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం క్లిష్టతరంగా మారిందంటూ చాలా మంది విదేశీయులు సామాజిక మాధ్యమాల్లో తమ బాధను చెప్పుకున్నారు.

వారంతా ఇప్పుడు అధ్యక్ష సలహా ఉపసంఘం చేసిన సిఫార్సుపై ఆశలు పెట్టుకున్నారు. వాటిని అమలు చేసి తమకు ఉపశమనం కలిగించాలని కోరుతున్నారు. అయితే, హెచ్-1బీ వీసాదారుల గ్రేస్ పీరియడ్ పెంచాలంటే చాలా పెద్ద ప్రక్రియను పాటించాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియలో అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు చేయడం మొదటి అడుగు మాత్రమేనని కార్నెల్ లా స్కూల్ ఇమ్మిగ్రేషన్ లా ప్రాక్టీస్ ప్రొఫెసర్ స్టీఫెన్ యేల్-లోహర్ వివరించారు.

మొదట, అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సులను యూఎస్ సిటిజన్షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసులు (USCIS) పాటించాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకవేళ యూఎస్సీఐసీ గ్రేడ్ పీరియడ్ ను పెంచాల్సి వచ్చినప్పటికీ, అందుకోసం సాధారణంగా సంబంధిత నిబంధనల సవరణ ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. అందుకోసం కొన్ని నెలల సమయం పడుతుందని చెప్పారు. అక్కడితే ఆగిపోలేదు.. ఒకవేళ యూఎస్సీఐసీ గ్రేడ్ పీరియడ్ ను పెంచినప్పటికీ ఆ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా ఉద్యోగులు కోర్టులో దావా వేసే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

చివరకు, ఇప్పటికే లే-ఆఫ్ ఎదుర్కొన్న ఉద్యోగులు గ్రేస్ పీరియడ్ పొడిగింపును వినియోగించుకునే అవకాశం ఉండకపోవచ్చని చెప్పారు. “హెచ్-1బీ వీసాదారుల గ్రేస్ పీరియడ్ పెంచాలని అధ్యక్ష సలహా ఉపసంఘం సిఫార్సు శుభవార్తే.. అయితే, అది అంత త్వరగా అమల్లోకి రాదు” అని మరో నిపుణుడు చెప్పారు. 8-కోడ్ ఆఫ్ రెగ్యులేషన్స్ లో సవరణలు చేయాల్సి ఉంటుందని, ఆ ప్రక్రియకు సమయం పడుతుందని తెలిపారు.
Nepal PM: నేపాల్ ప్రధాని అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్