Nepal PM: నేపాల్ ప్రధాని అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్

నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ గతేడాది డిసెంబర్ నెలలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు

Nepal PM: నేపాల్ ప్రధాని అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్

Nepal PM Pushpa Kamal Dahal

Nepal PM: నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ అధికారిక ట్విటర్ ఖాతా గురువారం తెల్లవారుజామున హ్యాక్ అయింది. ట్విటర్ ఖాతాలో దహల్ ప్రొఫైల్ కు బదులుగా ప్రో ట్రేడర్లకోసం నాన్ – ఫంగబుల్ టోకెన్ మార్కెట్ ప్లేస్ అయిన BLUR ఖాతా కనిపించింది. నేపాల్ ప్రధాని అధికారిక ట్విటర్ హ్యాండిల్ @PM_nepal_ అని ఉంటుంది. ఈ ఖాతా 690.1K అనుచరులను కలిగి ఉంది. అయితే, ఖాతాను వెంటనే పునరుద్దరించబడింది.  ట్విటర్ ఖాతా హ్యాకింగ్ విషయంపై ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ట్వీట్, ప్రకటన రాలేదు.

Nepal PM Prachanda: మూడోసారి నేపాల్ పీఎంగా ప్రచండ .. సోమవారం ప్రమాణ స్వీకారం..

నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ గతేడాది డిసెంబర్ నెలలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 1954 డిసెంబర్ 11న కాక్సీ జిల్లాలోని దికుర్పోఖరి ప్రాంతంలో జన్మించిన దహాల్ గెరిల్లా ఉద్యమ నేతగా ప్రాచుర్యంలోకి వచ్చారు. సీపీఎన్ – మావోయిస్టు పార్టీ శాంతియుత రాజకీయాలు ప్రారంభించిన అనంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చారు.

 

నేపాల్ పార్లమెంట్‌లో రెండవ అతిపెద్ద పార్టీ సీపీఎన్-యూఎంఎల్ ఫిబ్రవరిలో దహాల్ నేతృత్వంలోని ప్రభుత్వానికి తన మద్దతును ఉపసంహరించుకోవాలని నిర్ణయించిన విషయం విధితమే. అయితే శుక్రవారం ఉపాధ్యక్ష ఎన్నిక ముగిసిన తరువాత మార్చి20న నేపాల్ ప్రధాని పార్లమెంట్ లో విశ్వాస  తీర్మానాన్ని ఎదుర్కోనున్నట్లు వార్తలు వెలువడ్డాయి.