కారు బ్యాక్ సీట్లో ‘ఝుమ్మంది నాదం’ హడలిపోయిన ఫైర్ స్టేషన్ కు ఫోన్

Covid 19 Demand Lockdown Maharashtra Mumbai Rise

Mexico Man To Find His Car Honey Bees Buzzing : చూడరానిది చూస్తే ఎవ్వరైనా సరే హడలిపోతారు. కానీ న్యూ మెక్సికోలో షాపింగ్‌కు వెళ్లి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కుని కారు డిక్కీలో వేసుకుని వెళ్తున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ఆల్బర్ట్ ఓసన్ అనే వ్యక్తి మార్చి 28 న కారు డ్రైవ్ చేస్తు వెళ్తుండగా..ఏదో వింత సౌండ్ రావటం చూసి షాక్ అయ్యాడు. అదేమిటాని చెవులు రిక్కించి విన్నాడు. అది కారులోంచేనని వెనక సీట్లోంచి ఆ వింత శబ్దం వస్తోందని గుర్తించాడు. అదేమిటాని యథాలాపంగా తలతిప్పి వెనక సీటువైపు చూశాడు. అంతే ఒక్కసారిగా షాక్‌తో బిగుసుకుపోయాడు. భయంతో వణికిపోయాడు.

కారు వెనక వేల కొద్దీ తేనెటీగలు ఝుమ్మంటూ శబ్దం చేస్తూ కనిపించాయి. అదిచూసిన అతను ఏం చేయాలో పాలు పోలేదు. కారు సడెన్ బ్రేక్ వేసి ఆపేసి కారు దిగిపోయాడు. ఆ తరువాత ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి తన పరిస్థితి చెప్పాడు. దీంతో అతను చెప్పిన అడ్రస్ కు వెంటనే కారు వద్దకు చేరుకున్న సిబ్బంది కారు లోపల ఉన్న తుమ్మెదల గుంపును చూసి నోరెళ్లబెట్టారు. వారితోపాటు వచ్చిన డ్యూటీలో లేని ‘బీ కీపర్’ కూడా అయిన ఫైర్ ఫైటర్ జెస్సీ జాన్సన్ చొరవ తీసుకుని కారులోకి వెళ్లి తేనెటీగలను బయటకు వెళ్లగొట్టాడు. దీంతో బ్రతుకు జీవుడా అంటూ అతను ఇంటికి వెళ్లాడు. కాగా తేనె టీగలు కుడితే కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయం కూడా సంభవించవచ్చనే విషయం తెలిసిందే.

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక శాఖ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. వైట్ జాకెట్, జీన్స్ ప్యాంట్ ధరించిన జాన్సన్ తేనెటీగలను వెళ్లగొడుతున్నట్టు ఆ ఫొటోలో ఉంది. వేలాది తేనెటీగలు అతడిని కమ్మేశాయి. అదృష్టవశాత్తు ఆ తేనెటీగలు కోపంగా లేవని, చాలా ప్రశాంతంగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నాడు. కాగా, ఇది వాటికి పునరుత్పత్తి సీజన్ కావడంతో ఇలాంటి ఘటనలు అరుదైనవేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. రాణి తేనెటీగ, వాటి వెంట ఉండే శ్రామిక తేనెటీగలు కొత్త ఇంటి కోసం వెతుకుతుంటాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటాయని వివరించారు.