Monarch Butterflies : అంత‌రించిపోతున్న అంద‌మైన‌ మోనార్క్ సీతాకోక చిలుక‌లు.. ఇప్పటికీ రక్షించలేమా?

ఐకానిక్ మైగ్రేటరీ మోనార్క్ సీతాకోకచిలుక.. నలుపు, నారింజ రంగులతో విభిన్నంగా ఉంటుంది. ఈ జాతి సీతాకోకచిలుకలను సులభంగా గుర్తించవచ్చు.

Monarch Butterflies : అంత‌రించిపోతున్న అంద‌మైన‌ మోనార్క్ సీతాకోక చిలుక‌లు.. ఇప్పటికీ రక్షించలేమా?

Migratory Monarch Butterflies Are Listed As An Endangered Species

Updated On : July 23, 2022 / 6:48 PM IST

Monarch Butterflies : ఐకానిక్ మైగ్రేటరీ మోనార్క్ సీతాకోకచిలుక.. నలుపు, నారింజ రంగులతో విభిన్నంగా ఉంటుంది. ఈ జాతి సీతాకోకచిలుకలను సులభంగా గుర్తించవచ్చు. అయితే ఇప్పుడు ఈ జాతి సీతాకోకచిలుకలు అంతరించిపోతున్నాయట.. వాతావరణ మార్పుల కారణంగా వాటి నివాసాలను ఏర్పాటు చేసుకుని పరిస్థితులేకుండా పోయాయి. దాంతో వీటి జాతి క్రమంగా అంతరించిపోతుంది. వన్యప్రాణుల స్థితిని పర్యవేక్షిస్తున్న స్విట్జర్లాండ్ ఆధారిత పరిరక్షణ సంస్థ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) ఈ వారమే అంతరించిపోతున్న జాతుల జాబితాలో మైగ్రేట్ మోనార్క్ ( డానస్ ప్లెక్సిప్పస్ ప్లెక్సిపస్ ) సీతకోకచిలుకలను చేర్చింది. IUCN రెడ్ లిస్ట్‌లో ఇప్పుడు అంతరించిపోతున్న 41,000 కన్నా ఎక్కువ జాతులు వచ్చి చేరాయి.

అంతరించిపోతున్న జాతుల చట్టాన్ని అమలు చేసేందుకు సాయపడే US ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్ ఒకటి. డిసెంబర్ 2020 నుంచి అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో మోనార్క్ సీతాకోకచిలుకలను చేర్చింది. చాలావరకూ ఈ జాతి మైక్రేట్ మోనార్క్ సీతాకోకచిలుకల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్టు పరిరక్షణ గ్రూప్ నేచర్ సర్వ్‌కు కీలకమైనే సీన్ టి. ఓ’బ్రియన్ ఒక ప్రకటనలో చెప్పారు. ఈ జాతిని రక్షించే ప్రయత్నాలు ప్రోత్సాహకరంగానే ఉన్నాయని ఆయన అన్నారు. కానీ, ఆ మోనార్క్ సీతాకోకచిలుకల దీర్ఘకాలిక మనుగడను నిర్ధారించేలేమని అంటున్నారు. దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు.

Migratory Monarch Butterflies Are Listed As An Endangered Species (1)

Migratory Monarch Butterflies Are Listed As An Endangered Species

మోనార్క్‌ సీతాకోకచిలుకలకు ప్రత్యేకమైనవి కూడా :
మోనార్క్‌లు అందమైన పరాగ సంపర్కాలు మాత్రమే కాదు.. ప్రత్యేకమైనవి కూడా అంటున్నారు. US ఫారెస్ట్ సర్వీస్ ప్రకారం.. పక్షుల మాదిరిగా రెండు మార్గాల్లో మైగ్రేట్ అయ్యే ఏకైక సీతాకోకచిలుకలు ఇవి. తూర్పు, ఉత్తర అమెరికాలోని మోనార్క్ సీతాకోక చిలుకలు ఎక్కువగా మెక్సికో సియెర్రా మాడ్రే పర్వతాలకు దక్షిణాన కనిపిస్తుంటాయి. అయితే పశ్చిమాన కనిపించే ఈ జాతి సీతాకోక చిలుకలు కాలిఫోర్నియా వంటి తేలికపాటి తీర ప్రాంతాలకు వలస వెళ్తుంటాయి. వేసవి సమయంలో ఈ సీతాకోకచిలుకలు అమెరికా, కెనడా అంతటా సంతానోత్పత్తికి తిరిగి వస్తాయి.

IUCN కొత్త అంచనా ప్రకారం.. పురుగుమందులు, కలుపు సంహారకాలు, అటవీ నిర్మూలన, పట్టణ అభివృద్ధి కారణంగా మోనార్క్ సీతాకోకచిలుకల ఉపజాతి మైగ్రేట్ మోనార్క్ జనాభా గత పది సంవత్సరాలలో 22శాతం నుంచి 72 శాతం మధ్య తగ్గింది. వ్యవసాయ విస్తరణ కూడా ఇందుకు కారణంగా చెప్పవచ్చు. కరువు, అడవి మంటలు, విపరీతమైన ఉష్ణోగ్రతల రూపంలో మనం కలిగించే వాతావరణ మార్పులు కూడా ఈ జాతి సీతాకోక చిలుకలు అంతరించిపోయేలా చేస్తోంది. IUCN ప్రకారం.. తీవ్రమైన వాతావరణ సంఘటనలు మిలియన్ల మంది మోనార్క్ సీతాకోకచిలుకలను అంతమయ్యేలా చేశాయి.

గత 40 ఏళ్లలో మోనార్క్ సీతాకోకచిలుకల జనాభా 1980లలో 10 మిలియన్ల నుంచి 2021 నాటికి 1,914కి 99.9శాతం తగ్గింది. ప్రస్తుతం వీటి జాతి జనాభాలో తగినంత సీతాకోకచిలుకలు లేవని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోనార్క్ సీతాకోక చిలుకల జాతిని పెంచేందుకు శాస్త్రవేత్తలు, పరిరక్షకులు మరిన్ని పాలవీడ్, తేనె పువ్వులు నాటడం, అడవులను పెంచడం, సీతాకోకచిలుకల శ్రేణిలో పురుగుమందులు, కలుపు సంహారక మందుల వినియోగాన్ని పరిమితం చేయాలని సిఫార్సు చేస్తున్నారు. IUCN అనేక ఇతర జాతుల స్థితిని కూడా గుర్తించింది. యాంగ్జీ స్టర్జన్ ( అసిపెన్సర్ డబ్రియానస్ ) ఇప్పుడు అడవిలో అంతరించిపోయినట్లుగా గుర్తించింది. 17 ఇతర స్టర్జన్ జాతులు ఇప్పుడు తీవ్రంగా అంతరించిపోతున్నట్లు గుర్తించింది. చైనీస్ పాడిల్ ఫిష్ ( ప్సెఫరస్ గ్లాడియస్ ) ఇప్పుడు అంతరించిపోయింది. మరోవైపు.. అంతరించిపోతున్న పులుల సంఖ్య కూడా పెరుగుతోంది, 2015 నుంచి 40 శాతం పెరిగింది.

Read Also : Penguins Chase Butterfly : అందాల సీతాకోక చిలుక‌ వెంటపడిన పెంగ్విన్ల గుంపు..భలే గమ్మతైన వీడియో..