CAAపై పాక్ తీర్మాణం…భారత్ స్ట్రాంగ్ కౌంటర్

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై సోమవారం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో తీర్మాణం చేయడంపై కేంద్ర విదేశాంగశాఖ స్పందించింది. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు పాక్ లేదని భారత విదేశాంగ శాఖ తేల్చిచెప్పింది. పాక్ తీర్మాణాన్ని సృష్టంగా తిరస్కరిస్తున్నామని తెలిపింది. ఇది జమ్మూకశ్మీర్,లఢఖ్ ఇష్యూపై  పాకిస్తాన్ తన తప్పుడు కథనాన్ని మరింత ముందుకు తెచ్చే ప్రయత్నమని విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. భారతదేశం సరిహద్దుల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ నిరంతరాయంగా మద్దతు ఇవ్వడానికి ఇది సమర్థనను అందిస్తుంది. ఇటువంటి ప్రయత్నాలు విఫలమవుతాయని మేము విశ్వసిస్తున్నాము అని రవీష్ తెలిపారు. 

పాకిస్తాన్ తీర్మానం…స్వదేశంలో మతపరంగా మైనారిటీలను హింసించడం నుండి దృష్టిని మళ్లించడానికి పేలవమైన మారువేషంలో చేసిన ప్రయత్నమని రవీష్ అన్నారు. జెనీవాలో ప్రపంచ శరణార్థుల సదస్సుతో పాక్ ప్రాధాని చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ…భారత అంతర్గత వ్యవహారాల్లో అసందర్భ,అనవసరమైన వ్యాఖ్యలు చేసి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన కుట్రపూరిత రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకురావడానికి మరోసారి తెలిసిన అబద్ధాలను బహుళ పక్ష వేదికపైకి తెచ్చారని రవీష్ అన్నారు.

గడిచిన 72ఏళ్లుగా పాకిస్తాన్ క్రమబద్దంగా తమదేశంలోని మైనార్టీలను వేధిస్తూ ఉందని చాలామందిని బలవంతంగా భారత్ కు పారిపోయేలా చేస్తుందని భారత్ తెలిపింది. పాక్ ఆర్మీ 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ లో చేసిన పనిని ప్రపంచం మర్చిపోతుందని ఇమ్రాన్ ఖాన్ అనుకుంటున్నారని,పాక్ తప్పనిసరిగా వాళ్ల దేశంలోని మైనార్టీలను,సహ మతస్థులను కాపాడాలని,వాళ్ల హక్కులకు భంగం కలగకుండా వ్యవహరించాలని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
 

ట్రెండింగ్ వార్తలు