Samsung‌ను బాయ్‌కాట్ చేస్తున్న మొబైల్ రిటైలర్లు

కొరియన్ ఫోన్ శాంసంగ్‌ను భారత్‌లో బాయ్‌కాట్ చేయాలంటూ మొబైల్ రిటైలర్లు ఆందోళన చేస్తున్నారు. ‘మా నిరసనను డిజిటల్ పోస్టు ద్వారా.. షోరూంలలోని శాంసంగ్ ఫోన్లపై నల్లని ముసుగులు వేసి నిరసన తెలియజేస్తామని, శాంసంగ్ డిస్ట్రిబ్యూటర్ల నుంచి ఎటువంటి లావాదేవీలు జరపబోమని అంటున్నారు (AIMRA) ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అరవిందర్ ఖురానా అన్నారు. 

ఐదేళ్లలో ఈ శాంసంగ్ మేనేజ్‌మెంట్‌కు సందేశాలు పంపాం. వాళ్లు ఒక్కసారి కూడా AIMRAను కలుసుకునేందుకు వీలు కుదుర్చుకోలేదు. దాంతో పాటు మనం పంపిన ఈ మెయిల్స్ కూడా రెస్పాన్స్ రాలేదు. ఈ మేరకు శాంసంగ్  ఫోన్ బ్రాండ్ స్టోర్ అమ్మకాలను, ఆన్‌లైన్ అమ్మకాలను నిలిపివేయనున్నట్లు నిర్ణయాలు తీసుకున్నాం. Vivo, Oppo, Realme మొబైల్ మాన్యుఫ్యాక్చర్ల నుంచి సమాధానం రావడంతో పాటు చెప్పింది చెప్పినట్లుగా అన్ని చానెల్స్ లో ఒకే రేటుకు ఫోన్ల అమ్మకాలు జరిపారు. 

శాంసంగ్ దాని విరుద్ధంగా ఇష్టమొచ్చినట్లుగా వ్యవహరిస్తూ అమ్మకాలు జరుపుతుంది. అమెజాన్ పే తో టై అప్ అయ్యి క్యాష్ బ్యాక్ ఆఫర్లతో ఊరిస్తోంది. అటువంటి చర్యలు ఎక్కువ సంఖ్యలో డ్యామేజ్ అయ్యేలా చేస్తాయి. ఆఫ్‌లైన్ వ్యాపారులతో సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయి. ప్రస్తుతం శాంసంగ్ భారత మార్కెట్‌లో జియోమీ ఫోన్ తర్వాతి స్థానంలో అంటే రెండో పొజిషన్ లో కొనసాగుతుంది. 

భారత్‌లో శాంసంగ్ అమ్మకాలు 20.3శాతం జరుగుతుంటే వాటిల్లో 12-15శాతం వరకూ ఆఫ్‌లైన్ అమ్మకాలే. ఈ నిరసన శాంసంగ్‌ రెవెన్యూపై భారీ ప్రభావమే చూపనుందని నిపుణులు అంటున్నారు. శాంసంగ్ భవిష్యత్ అమ్మకాలపై వినియోగదారులకు అనుమానం వచ్చేలా కనిపిస్తోంది.