Moon Colony: మీదేం కాలనీ.. మీకు పేరు గుర్తుందా.. భూమిపై ఉన్న బోలెడు కాలనీలకు రకరకాల పేర్లుంటాయి కదా. అలాగే చంద్రుడిపై కూడా కాలనీ కట్టేసి దానికి మూన్ కాలనీ అని పేరు పెట్టనున్నారు. కొంచెం క్రేజీగా అనిపించినా చేయలేని అనిపించినా చంద్రుడిపై కాలనీ కడుతున్నారనే అద్భుతమైన విషయాన్ని బయటపెట్టారు. 2024 నాటికి మగ, ఆడ మొత్తం ఇద్దరు వ్యోమగాములను చంద్రుడిపైకి పంపుతామని నాసా హామీ ఇచ్చింది.
చంద్రుడిపై కాలనీ కట్టే మిషన్‌లో భాగంగా ల్యూనార్ మెటేరియల్స్‌తో నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్కడి వాతావరణం, తలాల స్వభావం, ఆస్ట్రోనాట్స్ బతకగల పరిస్థితులు ఉన్నాయా అని స్టడీ చేసి పనులు మొదలుపెడతారు. ఫొటోలో ఉండే సిలిండర్లు ఆస్ట్రోనాట్స్‌ను రేడియేషన్ నుంచి కాపాడటమే కాకుండా జోరో టెంపరేచర్‌ను కూడా తట్టుకునేలా చేస్తాయి. సూర్యుడి వేడితో ల్యూనార్ డర్ట్ తీసుకుని ఇటుకలు తయారుచేయొచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు.
శ్వాస పీల్చుకునే గాలికోసం క్రాటర్ పైనే కాలనీ నిర్మిస్తున్నారు. అక్కడ ఐస్ ఉండటం వల్ల దాని నుంచే ఆక్సిజన్, హైడ్రోజన్ పొందాలి. ఈ కాలనీ పేరును మూన్ విలేజ్ అని పిలుస్తున్నారు సైంటిస్టులు. వచ్చే దశాబ్దం నాటికి చంద్రుడిని బేస్ చేసుకుని బుధ గ్రహంపైకి ఆస్ట్రోనాట్స్‌ను పంపించాలని ప్లాన్ చేస్తున్నారు.
ఇవన్నీ పవర్ లేకుండా జరిగే పనులు కావన్నమాట. అందుకే సోలార్ ప్యానెల్స్ వేడిని రిఫ్లెక్ట్ చేసే సూర్యుడి కాంతితో పవర్ వినియోగించుకోవాలనే ట్రిక్ వాడనున్నారు. ఇది ధైర్యంతో కూడుకున్న పనితో పాటు ప్రపంచానికి బయట జరగేది కూడా.