Libya Floods : లిబియా వరద బీభత్సంలో 5,000 దాటిన మృతుల సంఖ్య
తుఫాను కారణంగా రెండు డ్యాములు, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. డ్యాములు తెగిపోవడంతో నగరంపై వరద విరుచుకుపడింది.
Libya Floods Death Toll : లిబియా వరద బీభత్సంలో మృతుల సంఖ్య 5,000 దాటింది. మరో 10,000 మందికి పైగా గల్లంతు అయ్యారు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. వరద ఉధృతిలో డెర్నా నగరం కొట్టుకుపోయింది. డేనియల్ తుఫాను కారణంగా భారీ వరదలు తలెత్తింది.
తుఫాను కారణంగా రెండు డ్యాములు, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసమైంది. డ్యాములు తెగిపోవడంతో నగరంపై వరద విరుచుకుపడింది. వరద ప్రవాహంలో కాలనీలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. వైద్య సదుపాయాలు నిలిచిపోయాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది.
IMD Alert : పలు రాష్ట్రాల్లో అతి భారీవర్షాలు…యూపీలో 19 మంది మృతి
గల్లంతైనవారు సముద్రంలోకి కొట్టుకుపోయి ఉంటారని, లేదంటే నగర శిథిలాల కింద ఉండి ఉంటారని యంత్రాంగం భావిస్తోంది. వరద కారణంగా రోడ్లు తెగిపోవడంతో సహాయక బృందాలు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. 30వేల మందికి పైగా నిరాశ్రయులైనట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ అంచనా వేస్తోంది.