Moscow : మాస్కోపై ఏకకాలంలో డ్రోన్ల దాడి.. దెబ్బతిన్న భవనాలు.. విమానాల రాకపోకలు నిలిపివేత..

రష్యా రాజధాని మాస్కోలో భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. పలు డ్రోన్లు ఏకకాలంలో దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది.

Moscow Drone Attack

Drone attack on Moscow: రష్యా రాజధాని మాస్కోలో భారీ డ్రోన్ దాడి కలకలం సృష్టించింది. పలు డ్రోన్లు ఏకకాలంలో దాడి చేయడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. అప్రమత్తమైన రష్యా సైన్యం పలు డ్రోన్లను కూల్చివేసింది. డ్రోన్ దాడి తరువాత మాస్కోలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ దాడిలో రెండు భవనాలు దెబ్బతిన్నాయి. అయితే, ఎవరికి గాయాలు కాలేదని తెలిసింది. రష్యా రాజధాని మాస్కో మేయర్ సెర్గే సోబియానిన్ ఆదివారం తెల్లవారు జామున ఈ విషయంపై స్పందించారు.. మాస్కోపై రాత్రి సమయంలో యుక్రెయిన్ డ్రోన్లు దాడి చేయడంతో రెండు భవనాలు దెబ్బతిన్నాయని తెలిపారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని టెలిగ్రామ్‌లో పోస్టు చేశారు.

Thailand : థాయ్‌లాండ్‌లో బాణసంచా గోదాం పేలుడు, 10 మంది మృతి, 118 మందికిపైగా గాయాలు

యుక్రెయిన్ సరిహద్దు నుండి 500 కిలో మీటర్లు (310 మైళ్లు ) దూరంలో ఉన్న రష్యా రాజధాని మాస్కో, దాని పరిసరాలు యుక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం వల్ల అరుదుగా లక్ష్యంగా చేయబడ్డాయి. తాజా డ్రోన్ల దాడి  కలకలంతో రాజధాని యొక్క  Vnukovo విమానాశ్రయం మూసివేయబడింది. విమానాశ్రయానికి రాకపోకలు నిలిపివేయబడినట్లు ఏవియేషన్ సర్వీసెస్ తెలిపింది. ఈనెల ప్రారంభంలో డ్రోన్ దాడుల కారణంగా నగరం నైరుతి దిశలో అదే విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కొంతకాలం అంతరాయం ఏర్పడింది. అయితే, శనివారం అర్థరాత్రి తరువాత జరిగిన డ్రోన్ల దాడిలో ఐదు డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా తెలిపింది.

Russia Launches Air Attack : ఉక్రెయిన్‌లోని కీవ్‌పై రష్యా వైమానిక దాడి

రష్యా, యుక్రెయిన్ దేశాల మధ్య 2022 ఫిబ్రవరి నెల నుంచి యుద్ద వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాన్ని వెనక్కి తీసుకొచ్చుకొనేందుకు యుక్రెయిన్ మాస్కోపై దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే శుక్రవారం రష్యా, యుక్రెయిన్ సరిహద్దులోఉన్న దక్షిణ రోస్టోవ్ ప్రాంతంపై రెండు యుక్రెయిన్ క్షిపణులను అడ్డగించిందని, టాగన్‌రోగ్ నగరంపై శిథిలాలు పడటంతో 16 మంది గాయపడినట్లు రష్యా తెలిపింది. ఇదిలాఉంటే శనివారం రాత్రి మాస్కోలో డ్రోన్‌ల దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాస్కోలోని ఒక అపార్ట్ మెంట్ భవనంలో మహిళ నిద్రిస్తుండగా డ్రోన్ ఢీకొట్టినట్లు ఓ వీడియోలో కనిపించింది. ఆమె నిద్రలేచి ఆందోళన చెందడం కనిపించింది.