Mother-Daughter Pilot Same Flight : ఒకే విమానంలో పైలెట్లుగా తల్లి కూతుళ్లు..ఆనందంతో పొంగిపోయిన మాతృహృదయం

పైలెట్ అయిన అమ్మ బాటలోనే నడవాలనుకుందో కూతురు. అలా తల్లీ కూతుళ్లు ఇద్దరు ఒకే విమానంలో కో పైలెట్లుగా డ్యూటీ నిర్వహించారు. ఈ వీడియోని సౌత్‌వెస్ట్​ ఎయిర్‌లైన్స్‌ తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఈ వీడియోని పోస్ట్‌ చేసింది. తొలిసారిగా తల్లి కూతుళ్లు ఇద్దరు పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారని పేర్కొంది.

Mother-Daughter Pilot Same Flight : పైలెట్ అయిన అమ్మ బాటలోనే నడవాలనుకుందో కూతురు. తల్లిని స్ఫూర్తిగా తీసుకుని నడవాలనుకున్న ఆమె కూడా బహుశా ఊహించి ఉండదేమో..తన తల్లీ తాను కలిసి ఒకే విమానానికి పైలెట్లుగా డ్యూటీ చేస్తారని..కానీ వారి జీవితంలో అరుదైన అద్భుతమైన ప్రయాణంలో ఇద్దరూ చేయి చేయి పట్టుకుని విమానం ఎక్కారు. తల్లికూతుళ్లు ఇద్దరు కో పైలెట్లుగా విమానాన్ని నడిపారు. ఇలా జరగడం అత్యంత అరుదు అనే చెప్పాలి.

తల్లీ కూతుళ్లు ఇద్దరు ఒకే విమానంలో కో పైలెట్లుగా డ్యూటీ చేసిన వీడియోని సౌత్‌వెస్ట్​ ఎయిర్‌లైన్స్‌ తన ఇన్‌స్టాగ్రాం పేజీలో ఈ వీడియోని పోస్ట్‌ చేసింది. తొలిసారిగా తల్లి కూతుళ్లు ఇద్దరు పైలెట్లుగా విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించారని పేర్కొంది. ఆ తల్లి పేరు హోలీ, కూతురు పేరు కెల్లీ. జులై 23న డెన్నవర్ నుండి సెయింట్ లూయిస్ కు 3658 ఫ్లైట్ లో కలిసి ప్రయాణించారు. విమానంలో ప్రయాణీకులకు కెప్టెన్ హోలీ తన కుమార్తెను పరిచయం చేసిన క్షణం కెమెరాలో మంగళవారం గుడ్ మార్నింగ్ అమెరికాలో ప్రసారం చేయబడింది.

ఈ శుభ సందర్భాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాను అంటూ తల్లీ హోలీ ఈ రోజు నాకు చాలా ప్రత్యేకమైనది..నేను నా కుమార్తె కెల్లీని మీకు కో పైలెట్ గా పరిచయం చేయటం సంతోషంగా ఉంది అని తెలిపారు. హోలీ కాలేజీ చదువు పూర్తికాగానే హోలీ ఫ్లైట్ అటెండర్ గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించింది. తరువాత పైలెట్ కావాలనే పట్టుదలతో తన కలను నెరవేర్చుకుంది. ఓ పక్క కుటుంబ బాధ్యతను నెరవేరుస్తూనే హోలీ కూతురు కెల్లీకి రెండు సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు విమాన పాఠాలను నేర్చుకుంది. కెల్లీతో పాటు హోలీకి మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయననా హోలీ పైలెట్ కావాలనే తన కలను వదులుకోలేదు. పట్టుదలతో పైలెట్ అయ్యింది. అలా ఆమె ఉద్యోగంలో చేరి 18 ఏళ్లు అవుతోంది. ఆమెకు ఇప్పుడు జతగా కూతురు కెల్లీ కూడా చేరటంతో ఆమె సంతోషం వ్యక్తం చేసింది.

తల్లీ కూతుళ్లు ఇద్దరు ఒకే విమానంలో పైలెట్లుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది.తల్లి, కుమార్తె ఇద్దరూ తమ లగేజీని తీసుకువెళ్లడం..ఒకే పైలట్ యూనిఫాం ధరించడం..వీరిద్దరూ కలిసి కాక్‌పిట్‌లో కనిపించటం ఇలా ప్రతీదీ ప్రత్యేకంగా ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ వీడియోకు లైకులు..వ్యూస్ ల ప్రయాణం కొనసాగుతునే ఉంది.

కాగా..గత జనవరిలో కూడా ఇటువంటి అరుదైన ప్రయాణమే జరిగింది. స్కైవెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేస్తున్న కెప్టెన్ సుజీ గారెట్  ఆమె కుమార్తె డోనా గారెట్ ఇద్దరు కలిసి మొదటిసారిగా విమానంలో ప్రయాణించి చరిత్ర సృష్టించారు.

ట్రెండింగ్ వార్తలు